Corona Temple: కరోనాకూ ఓ గుడి కట్టేశారు.. పూజలూ చేసేస్తున్నారు.. ఎక్కడో తెలుసుకోవాలని ఉందా.. 

|

May 22, 2021 | 7:15 AM

Corona Temple: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ తరుణంలో కరోనా ఎప్పుడు పోతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. భగవంతుడా ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి విముక్తి అని దేవుడిని నమ్మేవారంతా ప్రార్థనలు చేస్తున్నారు.

Corona Temple: కరోనాకూ ఓ గుడి కట్టేశారు.. పూజలూ చేసేస్తున్నారు.. ఎక్కడో తెలుసుకోవాలని ఉందా.. 
Corona Temple
Follow us on

Corona Temple: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ తరుణంలో కరోనా ఎప్పుడు పోతుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. భగవంతుడా ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి విముక్తి అని దేవుడిని నమ్మేవారంతా ప్రార్థనలు చేస్తున్నారు. కరోనాకి విరుగుడు త్వరగా వస్తే బావుండునని కోరుకుంటున్నారు. అయితే, ఆ దేవుడికీ.. ఈ దేవుడికీ పూజలు చేసే బదులు.. కరోనా కే పూజలు చేస్తే ఎలా ఉంటుంది? కరోనా ఏమిటి? దానికి పూజలు ఏమిటీ? అని అనుకోకండి. మీరు కరెక్ట్ గానే చదువుతున్నారు. కరోనాకి ఓ ఆలయం కట్టి పూజలు చేసి.. అమ్మా కరోనా తల్లీ నీకు పుణ్యం ఉంటుంది.. వెళ్లిపోవమ్మా.. అని ప్రార్ధనలు.. అష్టోత్తరాలు.. వీలైతే సహస్రనామార్చనలూ చేసి.. నైవేద్యాలు పెట్టి.. హారతులిస్తే ఎలావుంటుంది? ఒక్కసారి ఊహించండి. సరిగ్గా ఆ పనే చేస్తున్నారు కొందరు. ఏకంగా కరోనా దేవి అని పేరుపెట్టి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో చూద్దామా..

తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో ఈ కరోనా దేవి ఆలయం నిర్మించారు. ఇక్కడ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించాలని పూజలు మొదలు పెట్టారు. 48 రోజుల పాటు ఈ పూజలు చేస్తారట. ఈ విషయాన్ని ఆ ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోయంబత్తూరు శివారులోని ఇరుగుర్‌లో కామట్చిపురి అధినం ఆధ్వర్యంలో ఈ గుడిని ఏర్పాటు చేశారు. కరోనా దేవికి 1.5 అడుగుల నల్లరాతి విగ్రహం చేయించారు. దీన్ని ఆ మఠం పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు. కరోనా దేవికి నిష్టగా 48 రోజుల పాటు ప్రార్ధనలు చేస్తే.. ఈ తల్లి కరుణించి వెళ్ళిపోతుందని ఆశిస్తున్నట్టు నిర్వాహకులు అంటున్నారు.

ఇలాంటి విపత్కర సమయాల్లో ఇక్కడ ఆలయాలు(Corona Temple) నిర్మించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ప్లేగు వ్యాధి వచ్చి అనేకమందిని పొట్టన పెట్టుకున్నప్పుడు కూడా జిల్లాలో మరియమ్మన్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసి రోజూ పూజలు నిర్వహించినట్లు రికార్డులు ఉన్నాయి. ఆ తర్వాత ఈ స్థలం ప్లేగు మరియమ్మన్‌ ఆలయంగా నిలిచిపోయింది. ఇప్పుడు కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కరోనా దేవి ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. ఏమిటీ మీకూ ఈ ఆలయం చూసి కరోనా దేవిని దర్శించుకోవాలని ఉందా? అదేమీ కుదరదు.. కరోనా దేవి ఆలయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తారు. కేవలం పూజారులు, మఠం అధికారులను మాత్రమే ఇక్కడ ప్రవేశానికి అర్హులని అక్కడి అధికారులు చెబుతున్నారు. అదండీ సంగతి. ఏదేమైనా కరోనా మహమ్మారిని పారద్రోలాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అందులో ఇదీ ఒకటి. ఏది ఫలించినా మంచిదే కదా!

Also Read: Tighten Lockdown: త‌ప్పుడు ప‌త్రాల‌తో రోడ్లపైకి వస్తే కఠినచర్యలు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ

Two More Coronaviruses: మనుషులకు పొంచి ఉన్న మరో ముప్పు.. మరో రెండు వైరస్‌లను గుర్తించిన సైంటిస్టులు..?