బంగాళదుంప తొక్కలతో చేసిన వెరైటీ స్నాక్‌.. లక్షల మంది ఇష్టపడుతున్నారు.. వీడియో చూసి మీరు ట్రై చేయండి..

|

Nov 11, 2023 | 11:21 AM

ఆ తర్వాత తగినంత ఉప్పుతో పాటుగా మనం సాధారణంగా ఉపయోగించే అన్ని మసాలా దినుసులు వేశాడు.. మసాలాలన్ని ఆలూ తొక్కలకు బాగా పట్టేలా మిక్స్‌ చేశాడు. ఆ తర్వాత తొక్కలను మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి వేడి కావాల్సిన హీట్‌తో కాల్చాడు..ఇంకేం క్షణాల్లో ఆలూ తొక్కలతో చేసిన చిప్స్ రెడీ అయ్యాయి. జడ్జీలు కూడా వాటిని ఎంజాయ్‌ చేస్తూ తింటున్నారు.

బంగాళదుంప తొక్కలతో చేసిన వెరైటీ స్నాక్‌.. లక్షల మంది ఇష్టపడుతున్నారు.. వీడియో చూసి మీరు ట్రై చేయండి..
Potato Peel Chips
Follow us on

సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజూ లెక్కలేనన్ని ఫుడ్ వీడియోలు వస్తున్నాయి. ఒక్కో దేశానికి చెందిన రకరకాల రుచులను పరిచయం చేసే వీడియోలు ప్రతి ఒక్కరూ ఎప్పటినుంచో వెతుకుతూ, ఆసక్తిగా చూస్తున్నారు. ప్రత్యేకించి వారు ఆహార ప్రియులైతే, వారు కొత్త వంటకాలను చూడటానికి, నేర్చుకోవడానికి మరియు ప్రయత్నించడానికి ఖచ్చితంగా ఇష్టపడతారు. అంతే కాదు పరిమిత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పదార్థాలతో చాలా తేలికగా వంటకాలు తయారుచేస్తారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్న ఫుడ్ వీడియో ఇది. ఈ రెసిపీని మొదట రియాల్టీ షోలో ఒక కంటెస్టెంట్ పరిచయం చేశారు. బహుశా మీలో కొద్దిమంది దీని గురించి వినే ఉంటారు. అయితే ఈ వంటకాన్ని షోకి వచ్చిన జడ్జ్ లు, కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు నెటిజన్లు సైతం ఎంతగానో ప్రశంసిస్తున్నారు. వంటకం తయారీ సైతం ఎంతో సులభంగా ఉంది..

ఇవి కూడా చదవండి

ఈ వంటకంలో బంగాళాదుంప తొక్క ప్రధాన పదార్ధం. మనమందరం సాధారణంగా బంగాళదుంప తొక్కలను పడవేస్తుంటాము..కానీ, ఇక నుంచి బంగాళదుంప తొక్కను అలా తీసి పరేయకండి. ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంటే బంగాళాదుంప తొక్కలతో రుచికరమైన చిప్స్ ను సులభంగా తయారు చేసుకోవచ్చునని కుకింగ్ రియాల్టీ షో కంటెస్టెంట్ సూరజ్ థాపా వీడియో ద్వారా చేసి చూపించారు. ముందుగా బంగాళాదుంపను శుభ్రంగా కడిగి తొక్క తీశాడు.. ఆ తర్వాత తగినంత ఉప్పుతో పాటుగా మనం సాధారణంగా ఉపయోగించే అన్ని మసాలా దినుసులు వేశాడు.. మసాలాలన్ని ఆలూ తొక్కలకు బాగా పట్టేలా మిక్స్‌ చేశాడు. ఆ తర్వాత తొక్కలను మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టి వేడి కావాల్సిన హీట్‌తో కాల్చాడు..ఇంకేం క్షణాల్లో ఆలూ తొక్కలతో చేసిన చిప్స్ రెడీ అయ్యాయి. జడ్జీలు కూడా వాటిని ఎంజాయ్‌ చేస్తూ తింటున్నారు.

ఆ వీడియోలో రియాల్టీ షోకి న్యాయనిర్ణేతలుగా వచ్చిన ప్రముఖ చెఫ్‌లందరూ ఏకంగా సూరజ్ పొటాటో స్కిన్‌ చిప్స్‌ని మెచ్చుకుంటున్నారు. వాళ్లంతా చిప్స్ టేస్ట్ చేయడం చూస్తే, చిప్స్ బాగానే ఉన్నాయని అర్థమవుతుంది. ఇక ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంత తక్కువ ఇంగ్రిడియంట్స్ తో పాటుగా తక్కువ టైమ్ లో తయారైన ఆలూ తొక్కల చిప్స్ పట్ల పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. సూపర్ స్నాక్ అంటూ కామెంట్ పెడుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

మరిన్నిట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..