AC: ఎండాకాలంలో ఏసీ ఇలా వాడుతున్నారా..? పేలిపోతుంది జాగ్రత్త

వేసవి తీవ్రత నుంచి తప్పించుకోవడం కోసం చాలా మంది ఇళ్లలో ఏసీలు వాడుతుంటారు. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండటంతో.. గతంతో పోలిస్తే.. ఈసారి ఏసీలకు డిమాండ్‌ కాస్త పెరిగింది. ఏసీ వాడకంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పేలుడు సంభవించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

AC: ఎండాకాలంలో ఏసీ ఇలా వాడుతున్నారా..? పేలిపోతుంది జాగ్రత్త
AC Blast

Updated on: May 06, 2024 | 1:47 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఏ రేంజ్‌లో మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉదయం 9 దాటితే అడుగు బయట పెట్టలేని పరిస్థితి.  అన్ని ప్రాంతాల్లో దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. దీంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు.. డబ్బు అప్పు చేసి మరీ ఏసీలు పెట్టిస్తున్నారు. అయితే ఏసీలు వినియోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలా పడితే అలా వాడితే అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏపీ పేలకుండా, పాడవ్వకుండా ఎక్కువరోజులు మన్నడానికి నిపుణులు చెప్పే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

    1. లూజ్ కనెక్షన్, షార్ట్​ సర్క్యూట్,​ వైరింగ్​ సరిగా లేకపోవడం, ఏసీ వైర్లను ఎలుకలు కొరకడం వంటి కారణాల వల్ల పేలుడు సంభవించే చాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి.
    2. కొన్నిసార్లు కరెంట్‌ ఓల్టేజ్ హెచ్చు తగ్గుల కారణంగా ఏసీలోని భాగాలు దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో ఏసీ పేలొచ్చు. అందుకే  స్టెబిలైజర్‌ను ఉపయోగించడం ఉత్తమం
    3.  కొత్త ఏసీని ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు అనుభవం ఉన్న టెక్నీషియన్‌తో ఫిట్ చేయించాలి. మీరే యూట్యూబ్ చూసి ప్రయత్నాలు చేస్తే బెడిసికొట్టొచ్చు
    4. ఏసీలోని ఫిల్టర్‌లను తరచూ శుభ్రం చేయాలి.
    5. గది బాగా కూల్‌ అయిన తర్వాత ఏసీని కాసేపు ఆఫ్ చేయడం మంచిది
    6. ఏసీని సమయానికి సర్వీసింగ్ చేయించాలి
    7. ఏసీ కంప్రెస్సర్‌ ఎక్కువగా వేడెక్కితే.. అది పేలిపోయే అవకాశం ఉంటుంది
    8. ఏసీలోని కూలింగ్ సిస్టమ్​లో గ్యాస్ లీకేజీ అయితే.. దాని కారణంగా కూడా పేలుడు సంభవించొచ్చు
    9. ఏసీలోని రిఫ్రిజిరెంట్‌ లైన్‌లలో ఒత్తిడి ఏసీ పేలే చాన్స్ ఉంటుంది
    10. సాధారణంగా రూమ్ త్వరగా కూల్ అవ్వడం కోసం.. టర్బో మోడ్‌ వాడతారు. అయితే దాన్ని ఎక్కువసేపు ఉపయోగిస్తే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటున్నారు.
    11. ఎయిర్ కండీషనర్ నుండి గ్యాస్ వాసన వస్తుంటే వెంటనే టెక్నిషియన్‌ను సంప్రదించండి

ఈ టిప్స్‌ పాటించండి. అప్పుడప్పుడు ఏసీ తనిఖీ చేస్తూ ఉండండి.  ఏసీలో ఏవైనా సమస్యలు వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెక్నీషియన్‌తో సరిచేయిస్తే.. సమస్య ఉండదు.