Video Viral: వామ్మో.. ఈ పక్షికి ఎంతో కోపమో.. నాది అనుకుంటే అసలు వదిలేలా లేదుగా..

మానుషుల మాదిరిగానే జంతువులకు, పక్షులకు కూడా ఎమోషన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్బాల్లో అవి బయటపడుతుంటాయి.

Video Viral: వామ్మో.. ఈ పక్షికి ఎంతో కోపమో.. నాది అనుకుంటే అసలు వదిలేలా లేదుగా..
Viral Photo

Updated on: Oct 25, 2021 | 1:02 PM

మానుషుల మాదిరిగానే జంతువులకు, పక్షులకు కూడా ఎమోషన్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొన్ని సందర్బాల్లో అవి బయటపడుతుంటాయి. అయితే సాధారణంగా ఈ ఎమోషన్స్ జంతువులలో మాత్రమే కనిపిస్తాయి.. పక్షులలో కనిపించడం చాలా అరుదు..కానీ వాటిలో మితిమీరిన కోపం… కనిపిస్తుంటుంది.. ఇటీవల కాలంలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని మనసుకు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాన్ని పుట్టిస్తాయి. అలాగే కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది… తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ పక్షి పెద్ద చేపను పట్టుకుని వచ్చి ఇంటి మధ్యలో పడేస్తుంది… అయితే అక్కడే ఉన్న ఇంటి యజమాని ఆ చేపను పట్టుకోవడానికి ట్రై చేయగా.. వెంటనే చేపపై నిల్చోంది. అయినా సరే అని ఆమె ఆ చేపను లాక్కోగా..వెంటనే ఆమె వేలిపై దాడి చేసి చేపను పక్కన పడేసుకుంటుంది. అయితే ఈ ఘటన మొత్తం జరుగుతున్నంతసేపు పక్షి ఫుల్ సీరియస్‏గా కనిపిస్తుంది.

Also Read: National Film Awards: ఘనంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. రజినీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్…

Rajini Kanth: ఈరోజు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న రజినీకాంత్.. అయినా తలైవా మనసులో బాధే ఎందుకో..

Bigg Boss 5 Telugu: సన్నీతో గొడవే ఆమె కొంపముంచిందా ?.. ఒక్కరోజు ప్రియ ప్రవర్తనకు సీన్ రివర్స్..