ఇదేం బాధుడురా సామీ..! విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టిన కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు..

|

Oct 25, 2024 | 1:17 PM

కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులను దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ.. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది.

ఇదేం బాధుడురా సామీ..! విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టిన కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు..
Coaching Center Administrat
Follow us on

క్లాస్ రూమ్ లో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు ఓ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వీలో చోటు చేసుకుంది. నీట్ కోచింగ్ సెంటర్ క్లాస్‌లో నిద్రిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులను కొట్టడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. సదరు నిర్వాహకుడి దాడిలో కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్టుగా తెలిసింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు జలాల్ అహ్మద్‌పై కేసు నమోదు చేశారు.

ఈ మేరకు తిరునెల్వేలిలో నీట్ కోచింగ్ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులను దూషిస్తూ, కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ.. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. ఫుటేజీలో, అహ్మద్ విద్యార్థులను కొట్టడానికి కర్రను ఉపయోగించడం, విద్యార్థుల పై చెప్పులు విసరడం కనిపిస్తుంది.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. దీనిపై తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు కన్నదాసన్ విచారణ కోసం కోచింగ్ సెంటర్‌ను సందర్శించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..