Watch:ఓరీ దేవుడో.. ఇలాగైతే ఎలా బతికేది..? దొంగ కాకి ఏం చేసిందో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ఈ వీడియో WORLD OF BUZZ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి పోస్ట్ చేయబడింది. దీనిలో ఒక కాకి చాలా తెలివిగా దొంగతనం చేసింది. ఒక వ్యక్తి జేబులో నుండి డబ్బు దొంగిలించింది. ఆ కాకి నెమ్మదిగా ఒక వ్యక్తి జేబులోంచి డబ్బు తీసి, ఆ డబ్బును తన ముక్కులో పెట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయింది.. ఆ వృద్ధుడు, ఆ పక్కనే ఉన్న ఓ యువతితో కలిసి కాకి ముక్కుతో పట్టుకుని వెళ్తున్న డబ్బును తిరిగి తీసుకునేందుకు

Watch:ఓరీ దేవుడో.. ఇలాగైతే ఎలా బతికేది..? దొంగ కాకి ఏం చేసిందో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Clever Crow

Updated on: Feb 22, 2025 | 4:22 PM

కాకులు చాలా తెలివైన పక్షులు. అనేక పరిశోధనలు కాకులకు రెండేళ్ల పిల్లలతో సమానమైన తెలివితేటలు ఉన్నాయని నిరూపించాయి. కొన్ని దేశాల్లో శుభ్రపరిచే ప్రయోజనాల కోసం కాకుల్ని ఉపయోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఈ కాకులకు సిగరెట్ పీకలను ఏరివేయడంలో శిక్షణనిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో, ఒక కాకి ఒక వృద్ధుడి జేబులోంచి డబ్బు దొంగిలించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు.

ఈ వీడియో WORLD OF BUZZ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి పోస్ట్ చేయబడింది. దీనిలో ఒక కాకి చాలా తెలివిగా దొంగతనం చేసింది. ఒక వ్యక్తి జేబులో నుండి డబ్బు దొంగిలించింది. ఆ కాకి నెమ్మదిగా ఒక వ్యక్తి జేబులోంచి డబ్బు తీసి, ఆ డబ్బును తన ముక్కులో పెట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయింది.. ఆ వృద్ధుడు, ఆ పక్కనే ఉన్న ఓ యువతితో కలిసి కాకి ముక్కుతో పట్టుకుని వెళ్తున్న డబ్బును తిరిగి తీసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఆ కాకి మెల్లమెల్లగా ఎగిరిపోవడం, వృద్ధుడు, ఆ మహిళ తమ డబ్బు కోసం వాటి వెంట పరిగెత్తడం కెమెరాలో రికార్డయ్యాయి. వాళ్లు తమ డబ్బు కోసం కాకి దగ్గరికి రాగానే, కాకి కొంచెం ముందుకు ఎగిరి, ఆపై అందనంత ఎత్తుకు ఎగిరిపోయింది. అంతేకాదు..ఆ కాకి దొంగిలించిన డబ్బును ఒక భవనంలోని అనేక మందపాటి వైర్ల సెట్‌పై ఉంచుతుంది.. పైగా అక్కడే కూర్చుని పైనుండి చూస్తూ, తన వెంట పరుగెత్తుతున్న వారిని ఆటపట్టిస్తూ ఉంటుంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో సమాచారం లేదు, వీడియోను పోస్ట్ చేసిన WORLD OF BUZZ పేదవాడిని కాకి దోచుకుందని రాసి ఉంది.. ప్రతిచోటా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిందని, ఇప్పుడు కాకులు కూడా దొంగతనాలు చేయడం ప్రారంభించాయని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.