Watch Video: ఆదర్శగురువు..! విద్యార్థుల భవిత కోసం క్లాస్ టీచర్ ప్రయత్నం.. అసలు విషయం తెలిస్తే పడిపడి నవ్వాల్సిందే..

నిత్యం కొబ్బరి నూనెను తలకు రాసుకుంటే అన్ని రకాల జుట్టు సమస్యలు దూరం అవుతాయని మనకు తెలిసిన విషయమే. అయితే ఇదే విషయాన్ని క్లాస్ టీచర్ చెబితే..? ఆయనే స్వయంగా కొబ్బరి నూనెను తీసుకువచ్చి తన విద్యార్థులకు అందిస్తే..? సూపర్‌గా ఉంటుంది కదా..!

Watch Video: ఆదర్శగురువు..! విద్యార్థుల భవిత కోసం క్లాస్ టీచర్ ప్రయత్నం.. అసలు విషయం తెలిస్తే పడిపడి నవ్వాల్సిందే..
Class Teacher And Students

Updated on: Apr 09, 2023 | 6:20 AM

ఈ మధ్య కాలంలో జట్టు సమస్యలు బాగా పెరిగిపోయాయి. పాటించే జీవనశైలి, ఉద్యోగ బాధ్యతల కారణంగా ఒత్తిడి పెరగడం.. దాని ప్రభావంతో జుట్టు రాలిపోవడం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. అయితే నిత్యం కొబ్బరి నూనెను తలకు రాసుకుంటే అన్ని రకాల జుట్టు సమస్యలు దూరం అవుతాయని మనకు తెలిసిన విషయమే. అయితే ఇదే విషయాన్ని క్లాస్ టీచర్ చెబితే..? ఆయనే స్వయంగా కొబ్బరి నూనెను తీసుకువచ్చి తన విద్యార్థులకు అందిస్తే..? సూపర్‌గా ఉంటుంది కదా..! ఆ దృశ్యాలనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం బట్టతలతో బాధపడుతున్న ఓ టీచర్.. తన విద్యార్థులకు ఆ కష్టం రాకూదనే సదుద్దేశంతో స్వయంగా కొబ్బరి నూనె తీసుకువచ్చాడు. అంతేకాక ఒకరి తర్వాత ఒకరి తలపై తానే కొబ్బరి నూనెను పోస్తున్నాడు. అలాగే ‘మీరు రాసుకోండి’ అంటూ క్లాస్‌లోని విద్యార్థులకు అందిస్తున్నాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మాస్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి


కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 24 వేల లైకులు,. 4 లక్షల 22 వేల వీక్షణలు వచ్చాయి. ఇంకా వీడియోను చూసిన నెటిజన్లు సరదాసరదా కామెంట్లతో తమ తమ ప్రతిస్పందనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సదరు టీచర్ గురించి కష్టం తెలిసిన వ్యక్తి అని.. విద్యార్థుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయం అద్భుతమని మరి కొందరు అంటున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.