ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్. కానీ, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే తినేది కాదు.. తాగేది అనుకోవాలి మరీ..ఆశ్చర్యంగా ఉందా..? ఇందుకు సమాధానం కూడా ఉంది.. అదేంటంటే.. ఇటీవల మెక్ డొనాల్డ్స్ తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్లో సిగరెట్ పీకలు కూడా లభిస్తున్నాయి. అవును మీరు చదివింది నిజమే.. ఇప్పుడు ఫ్రెంచ్‌ఫ్రైస్ ప్యాకెట్‌లో సిగరెట్ ముక్కలు కనిపించటం కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు విషయం ఏంటంటే..
ఇంగ్లాండ్ లోని బారో ఇన్ ఫర్నెస్ ప్రాంతంలో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ నుంచి జెమ్మా కిర్క్ బోనర్ అనే మహిళ తమ పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ను ఆర్డర్ చేసింది. తన కొడుకుకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను తినిపిస్తుండగా..ఒక్కసారిగా షాక్కు గురైంది. అందులో సిగరెట్ ను గమనించింది. అది సగం కాలిపోయింది. సిగరెట్తో పాటు..అందులో సిగరెట్ బూడిద కూడా ఉంది. వెంటనే ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
వైరల్ అవుతున్న ఫోటోలో ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ కనిపిస్తుంది. ఇందులో సిగరెట్ స్టబ్ స్పష్టంగా కనిపిస్తుంది. పెట్టె లోపల బూడిద ఉందని బాధితులు చెప్పారు. ఏదిఏమైనా వీరిద్దరూ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ వార్త చూసిన చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..