
కొంత మంది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సమాయాల్లో వాళ్లు చేసే చేష్టలతో ఇతరును ఇబ్బంది పెట్టడంతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్ పోర్టులో వెలుగు చూసింది.తన లగేజ్‌ను విమానంలోకి అనుమతించక పోవడంతో చైనాకు చెందిన ఓ మహిళ ఎయిర్ పోర్టులో రచ్చ రచ్చ చేసింది. ఫ్లోర్‌పై పడి పోర్లాడుతూ కేకలు పెడుతూ నానా హంగామా సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే, చైనాకు చెందిన ఓ మహిళా తన ప్రయాణం నిమిత్తం ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే ఆమె తన వెంట తెచ్చుకున్నే లగేజ్ ఎయిర్‌లైన్స్ నిబంధనల పరిమితి మించి ఉండడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎక్కవగా ఉన్న లగేజ్‌ను విమానంలోకి అనుమతించేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ దగ్గర ఉన్న లగేజ్‌ను అయినా తగ్గించుకోండి, లేదా లగేజ్‌కు అదనంగా డబ్బులు అయిన చెల్లించండి అని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది చెప్పారు. ఇందును నిరాకరించిన మహిళ తాను అదనపు చార్జీలు కట్టనని ఎలాగైనా తన లగేజ్‌ను ఫ్లైట్‌లోకి అనుమతించాలని పట్టుబట్టింది.
అయినా కూడా సిబ్బంది లగేజ్‌ను అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదురు మహిళ ఎయిర్‌పోర్టులోనే నానా రచ్చ చేసింది. అక్కడే ఫ్లోర్‌పై పడి పొర్లుతూ, అరవడం, ఏడవడం స్టార్ట్ చేసింది. ఇలా దాదాపు అరగంట పాటు ఎయిర్ పోర్టు సిబ్బందికి చుక్కలు చూపించింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన విమానాశ్రయ సిబ్బంది ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. ఇందో ఆమె ప్రయాణికుల జాబితా నుంచి ఆమె పేరును తొలగించిన సిబ్బంది. ఆమెను మరో ఫ్లైట్‌లో వెళ్లాలని సూచించారు.
Une Chinoise a piqué une crise de colère à l’aéroport de Milan quand on lui a dit d’alléger ses bagages pic.twitter.com/9S7pRBj4FN
— 75 Secondes 🗞️ (@75secondes) June 11, 2025
అయితే, ఎయిర్‌పోర్టులో ఆ మహిళ ప్రవర్తించిన తీరుపై సదురు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొందరు ఆమె చేసిన రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రవర్తించి సదరు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..