Watch Video: కోట్లు పెట్టినా దొరకదు ఇలాంటి ప్రేమ.. పరుగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్న చింపాంజి పిల్ల..

|

Jun 17, 2023 | 3:57 PM

ప్రేమ.. అమ్మాయి, అబ్బాయి మధ్య చిగురించేది మాత్రమే ప్రేమ కాదు. తల్లి-బిడ్డల మధ్య ప్రేమ, తండ్రి-బిడ్డల ప్రేమ, సోదరసోదరిల మధ్య ప్రేమ, చెప్పుకుంటూ పోతే పెద్ద లీస్టే ఉంటుంది. ఇక మనుషి, జంతువుల మధ్య కూడా అంతకుమించిన ప్రేమ ఉంటుంది. అది ఎంత అందంగా ఉంటుందంటే..

Watch Video: కోట్లు పెట్టినా దొరకదు ఇలాంటి ప్రేమ.. పరుగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్న చింపాంజి పిల్ల..
Man Vs Animal Love
Follow us on

ప్రేమ.. అమ్మాయి, అబ్బాయి మధ్య చిగురించేది మాత్రమే ప్రేమ కాదు. తల్లి-బిడ్డల మధ్య ప్రేమ, తండ్రి-బిడ్డల ప్రేమ, సోదరసోదరిల మధ్య ప్రేమ, చెప్పుకుంటూ పోతే పెద్ద లీస్టే ఉంటుంది. ఇక మనిషి, జంతువుల మధ్య కూడా అంతకుమించిన ప్రేమ ఉంటుంది. అది ఎంత అందంగా ఉంటుందంటే.. కొన్ని కోట్లు పెట్టినా.. అలాంటి బంధం, సాన్నిహిత్యం, ప్రేమ, ఆప్యాయత లభించదంటే అతిశయోక్తి కాదు.

తాజాగా ఓ వ్యక్తి, చింపాంజి పిల్లకు సంబంధించిన బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తను సంరక్షించిన ఓ చింపాంజిని చాలా కాలం తరువాత వ్యక్తి కలుస్తాడు. అతన్ని దూరం నుంచే గమనించిన చింపాంజి పిల్ల.. ఎంతో ప్రేమతో, అప్యాయతతో చెంగు చెంగున ఎగురుతూ, అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చింది. మరోవైపు అతను సైతం ప్రేమగా తన చేతులు చాపి.. దానిని హత్తుకునేందుకు మోకాళ్లపై కూర్చుని పిలిచాడు. చింపాంజి పిల్ల అతని దగ్గరకు రాగానే.. వెంటనే తన రెండు చేతలుతో గట్టిగా కౌగిలించుకుంది. ఆ వ్యక్తి కూడా చింపాంజికి హత్తకుని, ముద్దు పెట్టుకుంటూ.. కన్నీటిపర్యంతం అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఈ హార్ట్ టచింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Enezator పేరుతో అకౌంట్ ‌నుంచి షేర్ చేశారు. ‘I Miss You Man’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య ప్రేమకు, బాండింగ్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మనుషులకంటే.. జంతువుల ప్రేమ స్వచ్ఛమైనదని, అవి ఎన్నటికీ మనలను మర్చిపోవని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..