Watch Video: బాంబుల వర్షం, తుపాకీల మోతతో దద్దరిల్లిపోయిన రణక్షేత్రం.. లైవ్ వార్.. చూస్తే హడలే..!
రెండు ప్రత్యర్థి దేశాల మధ్య యుద్ధం గురించి తెలుసు.. పోలీసులు, నేరస్తుల మధ్య జరిగే కాల్పుల గురించి కూడా తెలుసు.. ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య జరిగే భీకర పోరు కూడా తెలుసు.. ఇక దండకారణ్యంలో పోలీసుల, మావోయిస్టుల మధ్య జరిగే ఎన్‌కౌంటర్ కూడా తెలుసు..
రెండు ప్రత్యర్థి దేశాల మధ్య యుద్ధం గురించి తెలుసు.. పోలీసులు, నేరస్తుల మధ్య జరిగే కాల్పుల గురించి కూడా తెలుసు.. ఉగ్రవాదులు, ఆర్మీ మధ్య జరిగే భీకర పోరు కూడా తెలుసు.. ఇక దండకారణ్యంలో పోలీసుల, మావోయిస్టుల మధ్య జరిగే ఎన్‌కౌంటర్ కూడా తెలుసు.. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగానో.. వార్త ప్రసార సాధనాల మార్గంగానో ప్రపంచాన్ని చుట్టేస్తాయి. అయితే, ఇవి వినడం వరకే పరిమితం చేస్తాయి. మరి లైవ్ వార్‌ను ఎప్పుడైనా చూశారా? ఇరు పక్షాల మధ్య యుద్ధం ఎలా జరుగుతుందో ఎప్పుడైనా చూశారా? సమీపంగా ఉండి.. అటు నుంచి, ఇటు నుంచి కాల్పుల మోత మోగడాన్ని ఎప్పుడైనా చూశారా? కూతవేటు దూరంలోనే అణుబాంబు అంతటి బాంబుల పేలడం, భూమి చీలిపోయి భారీ గొయ్యి ఏర్పడటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి.
తాజాగా సోషల్ వీడియాలో వార్‌కు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అటువైపు నుంచి తూటాలు దూసుకువస్తుండగా.. ఇటువైపు నుంచి కూడా అంతకు మించి అన్నట్లుగా కాల్పుల మోత మోగింది. ఇరు పక్షాల పరస్పరం బాంబులు విసురుకోవడం, అవి ప్రత్యర్థి స్థావరాలను ధ్వంసం చేయడం క్లియర్‌గా ఈ వీడియోలో చూడొచ్చు. వరుస బాంబుల దాడితో అవతలి వర్గం మొత్తం ధ్వంసమైంది. దాంతో ఇటువైపు వారు విజయదరహాసంతో చిందులు వేశారు.
ఈ భీకరమైన వార్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బుల్లెట్లు శరీరాన్ని చీల్చడం ఖాయం అని, సైనికులకు నిజంగా హ్యాట్సాఫ్ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్ వీడియో..
war footage pic.twitter.com/yBSHubPikM
— clips that go hard (@clipsthatgohard) June 17, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..