Viral Video: పాకిస్తాన్‌ ఓడిపోయినందుకు పిల్లాడి ఏడుపు చూస్తే నవ్వొస్తుంది..! వైరల్‌గా మారిన వీడియో..

|

Nov 13, 2021 | 6:56 PM

Viral Video: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌ చేరింది. కానీ దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు

Viral Video: పాకిస్తాన్‌ ఓడిపోయినందుకు పిల్లాడి ఏడుపు చూస్తే నవ్వొస్తుంది..! వైరల్‌గా మారిన వీడియో..
Viral Video
Follow us on

Viral Video: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్‌ చేరింది. కానీ దుబాయ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ని చిత్తు చేసింది. ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. దీంతో పాక్ జట్టు కలలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఈ క్షణం పాక్ అభిమానులకు హృదయ విదారకమైన క్షణం. దీంతో సోషల్ మీడియాలో రకరకాల రియాక్షన్స్ కనిపించాయి. పాకిస్థాన్ ఓటమిపై భారత్‌లోని ప్రజలు పాక్ ఆటగాళ్లపై మీమ్స్ వేశారు. సోషల్ మీడియాలో కూడా చాలా రకాల హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. అలాగే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ ఓటమి తర్వాత ఒక పిల్లవాడు ఏడుస్తున్న వీడియోను షేర్ చేశారు.

వీడియోలో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు యువ అభిమాని చాలా నిరాశకు గురయ్యాడు. అతను విపరీతంగా ఏడుస్తుండటం మీరు వీడియోలో గమనించవచ్చు. అంతేకాదు చాలా కోపంగా కూడా ప్రవర్తిస్తాడు. చుట్టుపక్కల వారు అతనికి వివరిస్తున్నారు కానీ ఆ పిల్లవాడు ఏడుపు ఆపుకోలేకపోవడం మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ మాజీ పాకిస్తానీ క్రికెటర్ షోయబ్‌ అక్తర్ ఇలా రాశారు. ఈ ప్రపంచకప్ పాకిస్తాన్‌కి ఎంత ముఖ్యమో ఈ పిల్లాడి వీడియో చూస్తే అర్థమవుతుందని రాశారు.

ఈ వీడియోను ఇప్పటికే చాలామంది తిలకించారు. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు. పాపం పిల్లవాడు పాకిస్తాన్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు. మరొకరు అయ్యోయ్యో టీవీ పగలగొడుతాడేమో చూడండి అన్నారు. ఇంకొకరు పిల్లాడి దేశభక్తిని ప్రశంసించారు. ఈ ప్రపంచకప్‌లో పాక్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది. సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. సెమీస్‌లో టాస్‌ ఓడినా జట్టు మంచి స్కోర్‌ను నమోదు చేసి సత్తా చాటింది. విజయానికి దగ్గరగా వెళ్లింది. కానీ 19వ ఓవర్లో, మాథ్యూ వేడ్ మూడు సిక్సర్లు పాకిస్తాన్ నుంచి విజయాన్ని లాగేసాయి. దీంతో ఓటమిని భరించాల్సి వచ్చింది.

Health Tips: మీరు వందేళ్లు జీవించాలంటే ఈ 5 ఆహారాలు ప్రతిరోజు తినాలి.. అవేంటంటే..?

CA Exams 2021: డిసెంబర్‌ 5 నుంచి CA పరీక్షల నిర్వహణ.. ICAI మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి..

Kimjongun: కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించింది..! నెల రోజులుగా కనిపించడం లేదు..