Video Viral: ఈ వీడియో చూస్తే మీ బాల్యం గుర్తొస్తుంది.. చిన్నారి అమాయక చేష్టలకు నెటిజన్లు ఫిదా

|

Aug 15, 2022 | 6:53 AM

బాల్యం ఎంతో మధురమైనది. తెలిసీ తెలియని వయసులో చేసే అల్లరి జీవితాంతం గుర్తుండిపోతుంది. మరోవైపు సోషల్ మీడియాకు (Social Media) ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతారో ఎవ్వరి...

Video Viral: ఈ వీడియో చూస్తే మీ బాల్యం గుర్తొస్తుంది.. చిన్నారి అమాయక చేష్టలకు నెటిజన్లు ఫిదా
Child Viral
Follow us on

బాల్యం ఎంతో మధురమైనది. తెలిసీ తెలియని వయసులో చేసే అల్లరి జీవితాంతం గుర్తుండిపోతుంది. మరోవైపు సోషల్ మీడియాకు (Social Media) ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. పిల్లల ముద్దు ముద్దు మాటలు, అమాయకపు చేష్టలు చూసి ఎంతో మురిసిపోతాం. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న వీడియోలో ఓ పిల్లవాడు నీటి పైపుతో ఆడుకుంటున్నాడు. అక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. అతను పైపులో ఆడుకుంటున్న సమయంలో పైపు నుంచి నీళ్లు వస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో పోస్ట్ అయిన39 సెకన్ల వీడియోలో.. ఓ చిన్నారి పైపును పట్టుకుంటాడు. అయితే దాని నుంచి నీళ్లు వస్తుంటాయి. కాగా ఆ చిన్నారి పైపు సహాయంతో నీటిని గార్డెన్ లో పోసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే అనూహ్యంగా పైప్ నుంచి వచ్చే వాటర్ అతనిపై పడుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాగా అతను చూట్టూ తిరిగి చూస్తాడు. అయినా ఏం జరుగుతుందో తెలియక మొహం అమాయకంగా పెట్టుకుంటాడు. అంతే కాకుండా అలా చేస్తున్న సమయంలో ఏకధాటిగా చిన్నారిపై నీళ్లు పడటాన్ని మనం చూడవచ్చు.

ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో పోస్ట్ అయింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో అలరించింది. 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. లక్షల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ క్లిప్‌ను షేర్ చేయడంతో పాటు వివిధ రకాల కామెంట్‌లు, రియాక్షన్‌లను కూడా ఇస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి