Viral: పిల్లాడికి మంచం కింద కనిపించిన ఏదో నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్!

ఆమె ఓ డే కేర్ సెంటర్ నడుపుతోంది. అలాగే పిల్లలకు బేబీ సిట్టింగ్ చేస్తుంది. ఆ తరుణంలో ఓ పిల్లాడు మంచం కింద ఏదో నల్లటి ఆకారాన్ని చూశానని చెప్పాడు. అదేంటి అని చూడగా.. దెబ్బకు ఒక్కసారిగా షాక్ అయింది. ఆ వివరాలు..

Viral: పిల్లాడికి మంచం కింద కనిపించిన ఏదో నల్లటి ఆకారం.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్!
Viral

Updated on: Mar 28, 2025 | 2:04 PM

కొందరు పిల్లలకు బేబీ సిట్టింగ్ చేస్తుంటారు. రోజంతా వారి ఆలనాపాలన చూస్తూ.. వారికీ ఏదొకటి తినిపించి పడుకోబెడుతుంటారు. మన దేశంలో ఈ సంస్కృతీ తక్కువైనప్పటికీ.. ఇతర దేశాల్లో ఇది ఎక్కువ. తాజాగా ఈ కోవలోనే ఓ బేబి సిట్టర్.. ఒక పిల్లాడిని పడుకోబెడుతుండగా.. ఆ పిల్లవాడు మంచం కింద ఏదో నల్లటి ఆకారం ఉందని చెప్పాడు. ముందుగా ఆ బేబీ సిట్టర్ ఆ పిల్లవాడు చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఆ తర్వాత ఆ పిల్లోడు చెప్పింది నిజమై ఉండొచ్చునేమోనని.. కిందకు తొంగి చూడగా.. సదరు బేబి సిట్టర్ దెబ్బకు షాక్ అయింది. ఈ సంఘటన రాత్రి 10:30 గంటల ప్రాంతంలో జరిగింది. మార్చి 24న కెన్సాస్‌లోని విచితకు ఉత్తరాన 100 మైళ్ల దూరంలో ఉన్న గ్రేట్ బెండ్ నగరంలో చోటు చేసుకుంది. ఆ ఇంట్లో బేబీ సిట్టర్ పిల్లలను చూసుకుంటుండగా షాకింగ్ విషయం బయటపడింది.

ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

పిల్లాడు ఏదో నల్లటి ఆకారాన్ని మంచం కింద చూశానని బేబీ సిట్టర్‌కు చెప్పాడు. ఇక ఆమె కింద చూడగా అక్కడ 27 ఏళ్ల మార్టిన్ విల్లాలోబోస్ దాక్కుని ఉండటాన్ని గుర్తించింది. కొంతకాలం క్రితం సదరు వ్యక్తిపై ఓ దాడి కేసు నమోదైంది. ఆ ఇంట్లోనే ఏదో తప్పు చేసి.. పోలీసులకు చిక్కాడు. ఇక అతడు మళ్లీ ఆ ఇంట్లోని వారిపై రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చాడు. ఆ రోజు ఇంటికి వచ్చిన మార్టిన్, బేబీ సిట్టర్‌తో గొడవకు దిగాడు. ఆ తరుణంలో పిల్లలలో ఒకరికి గాయాలయ్యాయి. కానీ ఎలాగోలా పోలీసులకు సమాచారం అందించగా.. అధికారులు వెంటనే అక్కడికి వచ్చారు. కానీ మార్టిన్‌ను వారు కనిపెట్టలేకపోయారు. మరుసటి రోజు ఉదయం, అధికారులు ఆ ప్రాంతానికి మళ్లీ రాగా.. అతడు స్థానికంగా ఉన్న అడవి ప్రాంతంలో చిక్కాడు. అతడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా