మటన్.. చికెన్.. బిర్యానీ.. అనగానే చాలా మందికి నోరూరుతుంది. సాధారణంగా బిర్యానీని ఇష్టపడని మంసాహారులంటూ ఎవరూ ఉండరు.. ఆహా.. ఓహో అంటూ బిర్యానీని లొట్టలేసుకుంటూ మరీ తింటారు. అయితే, నోరూరించే రుచికరమైన పదార్ధాలను ఆస్వాదించడం అంటే చాలా మందికి ఇష్టం.. ఇంకా చౌకగా ఉంటే.. ఫుల్లుగా లాగించేస్తారు. ఇప్పుడు, చౌకగా.. పాకెట్ ఫ్రెండ్లీగా ఉండే రోజులు పోయాయి. ఒకప్పుడైతే.. అవన్నీ సాధ్యమయ్యాయి కానీ.. ఇప్పుడు అలా లేదు.. ఏది ముట్టుకున్న మంటలే.. ఏది తినాలన్నా డబ్బులు ఎక్కువగా పెట్టాల్సిందే. అయితే, 90వ దశకంలో జన్మించిన వ్యక్తులు చౌకగా తిని ఉంటారు. ఇప్పుడు అలా కాదు.. తరం మారింది.. రేట్లు కూడా మారాయి.. అప్పట్లో పది రూపాయిలు ఉండేవి.. ఇప్పుడు వందల రూపాయలు దాటాయి. మార్పుతోపాటు.. ధరల్లో కూడా భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది.
అప్పటికి.. ఇప్పటికీ కళ్లముందు ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. కీప్యాడ్ మొబైల్ ఫోన్‌ల నుంచి స్మార్ట్ ఫోన్‌ల వరకు.. CRT టెలివిజన్ సెట్‌ల నుంచి స్మార్ట్ టీవీల వరకు.. 90ల నాటి వారు అన్ని మార్పులను చూశారు.
అయితే, సోషల్ మీడియా అప్పటి రోజులను మళ్లీ గుర్తుచేస్తోంది. ఇది చూసి నెటిజన్లు నిజమే ఆ రోజులు మళ్లీ రావంటూ నోరెళ్లబెడుతుంటారు. తాజాగా, 2001కి చెందిన ఒక రెస్టారెంట్ మెనూ కార్డ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 90ల నాటి వారిని ఇది మైమరిపించేలా చేయడంతోపాటు.. నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న మెనూ కార్డ్‌లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల జాబితా.. వాటి ఖర్చులను దానిలో పొందుపరిచారు.
ప్రస్తుతం ఒక్కో ప్లేట్‌కు దాదాపు రూ.150 ఉన్న చికెన్ బిర్యానీ అప్పట్లో రూ.30కి విక్రయించేవారు. అదే విధంగా, ఇప్పుడు ప్లేట్‌కు సుమారు రూ. 250 చొప్పున విక్రయిస్తున్న మటన్ బిర్యానీ 2001లో రూ.32 మాత్రమే ఉండేది.
2001లో ఎగ్ రోల్, చికెన్ రోల్, ఎగ్ చికెన్ రోల్, స్పెషల్ చికెన్ రోల్ వరుసగా రూ.7, రూ.10, రూ.15, రూ.24గా మాత్రమే ఉండేవి.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పటి నుంచి మెనూ కార్డ్ పోస్ట్ 3500 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది. ఈ చిత్రం గత జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా చేసింది.
దీనిని చూసి.. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొకరు ఇంకా ఆ రోజులు రావు.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. “రూ.7 ఎగ్ రోల్ రూ.70 గా మారింది.. అసలు రూపాయలలో దొరికే పదార్థాలే లేవంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..