Viral Video: దూడను ఢీకొట్టి పారిపోతున్న కారు డ్రైవర్.. వెంబడించి కారును ఆపేసిన ఆవులు.. చివరికి..!

|

Dec 22, 2024 | 4:27 PM

ఓ ఆవు దూడ కారు కిందకు రావడంతో పది మీటర్ల దూరం వరకు రోడ్డు పొడవునా ఆ దూడ కారుకిందే ఉండిపోయింది గమనించిన తల్లి ఆవు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కారుకు ఎదురుగా నిలబడింది. అది గమనించిన స్థానికులు ఆ దూడను రక్షించిన చికిత్స నిమిత్తం పశువుల ఆసుపత్రికి తరలించారు.. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్‌ రోడ్డు వద్ద జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది.

Viral Video: దూడను ఢీకొట్టి పారిపోతున్న కారు డ్రైవర్.. వెంబడించి కారును ఆపేసిన ఆవులు.. చివరికి..!
Cows Attack On Car
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక దూడను రక్షించేందుకు ఆవులు కారును చుట్టుముట్టాయి. కారు కింద చిక్కుకున్న ఆవు దూడను రక్షించడానికి డ్రైవర్ బలవంతంగా కారు నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో స్థానికులు కారు డ్రైవర్‌కు సహాయం చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రమాదంలో దూడకు పెద్దగా గాయాలు కానప్పటికీ, కారు ఆపకపోతే మాత్రం దూడ చనిపోయేది.

ఈ ఘటన రాయ్‌గఢ్‌లోని సుభాష్‌ చౌక్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ దూడను ఢీకొట్టి పారిపోయాడు. అయితే ఆవుల మంద అతడిని వెంబడించి చివరకు దూడను కాపాడి తిరిగి వచ్చింది. ఓ కారు డ్రైవర్ ఆవు దూడను ఢీకొట్టి 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. తల్లి ఆవుతో పాటు మరి కొన్ని ఆవులు కారును వెంబడించి ఆపాయి. కారుకు అడ్డంగా నిలబడి కదలనివ్వకుండా చేశాయి. కారు కింద చిక్కుకున్న దూడను స్థానికులు రక్షించారు. దూడ కాలు విరిగి పొట్టకు గాయమైంది. దీంతో స్థానికులు ఆవు దూడను చికిత్స నిమిత్తం పంపించారు. గాయపడిన దూడ వద్దకు ఆవులు చేరుకున్న తీరును చూసి స్థానికులు నివ్వెరపోయారు.

రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు డ్రైవర్ దూడను ఢీకొట్టాడని, అయితే అతను కారును అక్కడికక్కడే ఆపలేదని చెబుతున్నారు. ఢీకొన్న తర్వాత దూడ కారు కిందకు వచ్చి ఇరుక్కుపోయింది. అలాంటి పరిస్థితిలో కారు కింద ఇరుక్కున్న దూడ రోడ్డుపై ఈడ్చుకెళ్లి కారుతో పాటు కదులుతున్నప్పటికీ డ్రైవర్ కారు ఆపలేదు. ఇక్కడ దూడను చూడగానే ఆవులు కారు వెనుక పరుగెత్తడం ప్రారంభించాయి. రైల్వే స్టేషన్‌ నుంచి సుభాష్‌ చౌక్‌కు కారు చేరుకోగా, ఆవులు అక్కడి నుంచి వెళ్లలేదు. కారు ఆగగానే ఆవులన్నీ కారు ముందు నుంచి చుట్టుముట్టాయి.

కారు ఆగిన తర్వాత ఆవులు దాని చుట్టూ తిరగడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో, డ్రైవర్ బలవంతంగా కారు నుండి దిగారు. స్థానికుల సాయంతో కారును పైకి లేపి కింద ఇరుక్కున్న ఆవు దూడను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో దూడ స్వల్పంగా గాయపడింది. దూడను విడిపించిన తర్వాత, ఆవులు కారును వదిలిపెట్టాయి. ఈ ఘటన అంతా షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..