Chess Olympiad 2022: అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లను అభినందించేందుకు పుదుచ్చేరికి చెందిన డీప్ సీ స్విమ్మింగ్ కోచ్ 60 అడుగుల లోతులో చదరంగం ఆడుతున్న వీడియోను రూపొందించి ఆశ్చర్యానికి గురిచేశాడు. పుదుచ్చేరిలోని మామల్లపురంలో 44వ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ జరుగుతోంది. 10వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ సహా 187 దేశాల నుంచి 2,500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తమిళనాడులో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నందున.. స్వాగతించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రఖ్యాత డీప్ సీ ట్రైనర్ అరవింద్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెంపుల్ అడ్వెంచర్ పేరుతో తమిళనాడు, పుదుచ్చేరిలో డీప్ సీ శిక్షణ ఇస్తున్న అరవింద్.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, క్రీడా విజయాలను, దేశభక్తిని పురస్కరించుకుని సముద్రం లోపల పలు విన్యాసాలు చేస్తున్నాడు.
ఈ సందర్భంలో, ప్రస్తుతం జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారులను ప్రోత్సహించడానికి, అభినందించడానికి అరవింద్ తన సోదరుడితో సముద్రంలో 60 అడుగుల లోతులో నీటి అడుగున చెస్ ఆడాడు. అలాగే డీప్ సీ స్విమ్మింగ్ కోచ్ అరవింద్ గుర్రం వేషధారణలో సముద్రంలో చెస్ మ్యాచ్‌లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..