Vaccine Auto: వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ వినూత్న ప్రచారం.. ఆకట్టుకుంటున్న ‘వ్యాక్సిన్ ఆటో’.. వైరల్ వీడియో

|

Jul 04, 2021 | 10:34 AM

Chennai Vaccine Auto: దేశంలో కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజుల క్రితం కరోనా సెకండ్ వేవ్‌లో నిత్యం నాలుగు లక్షలకు

Vaccine Auto: వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ వినూత్న ప్రచారం.. ఆకట్టుకుంటున్న ‘వ్యాక్సిన్ ఆటో’.. వైరల్ వీడియో
Chennai Vaccine Auto
Follow us on

Chennai Vaccine Auto: దేశంలో కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజుల క్రితం కరోనా సెకండ్ వేవ్‌లో నిత్యం నాలుగు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమై ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం పరిస్థితి కొంత కుదుటపడింది. అయితే.. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న నిపుణుల సూచనలతో.. కరోనా కట్టడికి ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు జంకుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నప్పటికీ.. చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రజలంతా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాంటూ.. అవగాహన కల్పించేందుకు కొంత మంది నడుంబిగిస్తున్నారు. తాజాగా ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహనా కల్పించడానికి చెన్నైకి చెందిన ఒక వ్యక్తి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలని తెలియజేయడానికి ఒక ఆటో రిక్షాకి వాక్సిన్ రూపాలను జతచేశాడు.

అనంతరం చెన్నైలోని వీధులంతా తిరుగుతూ.. అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వ్యాక్సిన్ ఆటోకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను ఆర్ట్ కింగ్‌డమ్ అనే పేజీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తర్వాత ఈ ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ కోవిడ్ -19 ‘వ్యాక్సిన్ ఆటో’ ను చెన్నైకి చెందిన కళాకారుడు బి. గౌతమ్ రూపొందించారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు అతను వెల్లడించాడు. రోగనిరోధక శక్తిని వేగంగా పెంపొందించుకోవడానికి టీకా తీసుకోవడం చాలా ముఖ్యమని అతను వీధివీధి తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నాడు.

ఈ వ్యాక్సిన్ ఆటోను వ్యర్థ పదార్థాలైన వేస్ట్ పైప్, పాత ప్లాస్టిక్ బాటిల్ మరియు ప్లైవుడ్ వంటి వాటితో రూపొందించారు. ఇది చూడటానికి కొంత విచిత్రంగా కనిపిస్తూ.. ప్రజలను ఆకట్టుకుంటోంది. దీనికి బ్లూ కలర్ పెయింట్ వేసి.. దీనికి పెద్ద పెద్ద సిరంజిలు, వ్యాక్సిన్ బాటిల్స్ ఏర్పాటు చేసాడు. కోవిడ్ 19 వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను వివరించడానికి.. ఈ విధంగా రూపొందించినట్లు గౌతమ్ తెలిపాడు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌తో చేతులు కలిపి ఈ కరోనా వ్యాక్సిన్ ఆటోను డిజైన్ చేసినట్లు వెల్లడించాడు. అయితే.. వ్యాక్సిన్ ఆటోను పూర్తిగా రూపొందించడానికి దాదాపు పది రోజుల సమయం పట్టిందని తెలిపాడు.