
Viral Video: టెక్నాలజీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. మనుషులు చేసే దాదాపు అన్ని పనులను ఇప్పుడు యంత్రాలే చేసేస్తున్నాయి. దుస్తులు ఉతకడం నుంచి వంట చేసే వరకు ప్రతీ చిన్న పనికి ఒక యంత్రం అందుబాటులోకి వచ్చేసింది. మనుషులకు ఒత్తిడిని తగ్గించి వారి పనులు చేసిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఓ దోశ ప్రింటర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిన్న సైజ్ ప్రింటర్‌లా ఉన్న ఈ పరికరానికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చెన్నైకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ రూపొందించిన ఈ దోశ ప్రింటర్ అచ్చంగా చిన్న సైజులో ఉన్న ప్రింటర్‌లా ఉంది. ప్రింటర్‌లో ఎలాగైతే ఇంక్‌ను పోస్తామో. అలాగే ముందుగా దోశ పిండిని వేయాలి. అనంతరం మిషన్‌ను ఆన్ చేసి టైమర్ సెట్ చేయాలి. కాసేపటికే మిషన్ మరో ఎండ్ నుంచి వేడి వేడి దోశ బయటకు వచ్చేస్తుంది.
ఈవోచెఫ్ పేరుతో రూపొందించిన ఈ మిషన్‌ను ప్రపంచంలోనే తొలి స్మార్ట్ దోశ మేకర్‌గా పిలుస్తున్నారు. ఈ దోశ ప్రింటర్‌కు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మెషిన్ ధర ఎంత అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Dosa printer ? pic.twitter.com/UYKRiYj7RK
— Samantha /சமந்தா (@NaanSamantha) August 23, 2022
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..