Trending: రాజస్థాన్‌లో కొనుగోలు చేసిన ఒంటెతో తమిళనాడులో బిజినెస్‌..నది ఒడ్డున పట్టుకున్న పోలీసులు..ఎందుకో తెలిస్తే షాకే!

|

Jun 03, 2022 | 8:07 AM

బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువులు దొంగిలించే దొంగలుంటారని తెలుసు..పంట పొలాల వద్ధ దాన్యం, పశువులను కూడా ఎత్తుకెళ్లిన దొంగల గురించి విన్నాం. కానీ, ప్రస్తుత కాలంలో బంగారమైపోయిన ఇసుక చోరీలు కలకలం రేపుతున్నాయి. ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. అవును మీరు విన్నది నిజమే..

Trending: రాజస్థాన్‌లో కొనుగోలు చేసిన ఒంటెతో తమిళనాడులో బిజినెస్‌..నది ఒడ్డున పట్టుకున్న పోలీసులు..ఎందుకో తెలిస్తే షాకే!
Stealing Sand
Follow us on

బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువులు దొంగిలించే దొంగలుంటారని తెలుసు..పంట పొలాల వద్ధ ధ్యానం, పశువులను కూడా ఎత్తుకెళ్లిన దొంగల గురించి విన్నాం. కానీ, ప్రస్తుత కాలంలో బంగారమైపోయిన ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. అవును మీరు విన్నది నిజమే..దేశంలో ఇప్పుడు ఇసుక బంగారమైపోయింది..ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడటంతో మాఫియాలు, దొంగలు పుట్టుకొస్తున్నారు. మండుతున్న ఇసుక ధరలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఇసుక కనిపిస్తే చాలు ఎత్తుకెళుతున్నారు. ఇక్కడ మరో విచిత్రమేంటంటే..లారీ, టిప్పర్‌ ట్రాక్టర్‌ లతో ఇసుక దోపిడీ గురించి విన్నాం..కానీ, అందుకు భిన్నంగా ఇక్కడో వ్యక్తి చేసిన ఇసుక దోపిడీ గురించి తెలిసి పోలీసులే విస్తూ పోయారు. ఇసుకను ఎత్తుకెళ్లేందుకు ఏకంగా ఒంటెలను ఉపయోగించాడు ఓ ప్రబుద్ధుడు. సమాచారం అందుకున్న..పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని  శివగంగై జిల్లా కలైయార్‌కో సమీపంలోని మరవమంగళం బల్లకోట్టై ప్రాంతానికి చెందిన శరవణన్ (52),.. చాలా ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన అతడు ఎద్దుల బండి సాయంతో నది ఇసుకను రవాణా చేస్తున్నాడు. ఇసుక బరువును మోయలేక ఆ ఎద్దులు కాస్త అస్వస్థతకు గురికావటంతో అతడు మరోప్లాన్‌ వేశాడు. ఈ సారి ఇసుక తరలింపుకు ఒంటెను రంగంలోకి దింపాడు..ఇందుకోసం రాజస్థాన్ నుంచి ఒంటెను కొనుగోలు చేశాడు. ఒంటెతో రెండు టైర్ల బండిని లాగే విధంగా ఏర్పాటు చేసుకుని నది నుండి ఇసుక తరలింపు మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులు.. శరవణన్ తన ఒంటెతో ఇసుకను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. ఇసుక తరలింపు బండి, ఒంటెను స్వాధీనం చేసుకున్నారు. మరవమంగళం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో ఒంటె నిర్వహణ పోలీసులకు ఇబ్బందిగా మారటంతో తిరిగి ఒంటెను దాని యజమానికి అప్పగించారు. నిందితుడు కళయార్‌కోయిల్ సమీపంలోని నది తీరం నుండి ఇసుకను రవాణా చేయడానికి మొదట ఎద్దుల బండ్లను ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. ఎద్దులు అంత బరువు మోయలేకపోవటంతో..అతడు రాజస్థాన్ నుండి ఒంటెను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన ఒంటెను కేరళలో ఉంచి శివగంగకు ఇసుక తరలింపుకు ఉపయోగిస్తున్నట్టు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.