Funeral for BSNL landline: మనుషులు చనిపోతే అంత్యక్రియలు చేస్తారు. అపురూపంగా చూసుకున్న జంతువులు చనిపోయినా, అంతిమ సంస్కారాలు నిర్వహించడం చూస్తాం. కానీ, ఫోన్‌కు అంత్యక్రియలు చేయడం ఎప్పుడైనా చూశారా..? ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ కాలంలో ల్యాండ్ ఫోన్ వాడటం అరుదైన విషయం. వేల మందిలో ఎవరో ఒకరు ల్యాండ్ ఫోన్ వాడుతుంటారు. కొంతమంది BSNLపై ప్రేమతో కూడా ల్యాండ్ ఫోన్‌లు వాడటం మనం చూస్తుంటాం. అలానే చెన్నైలో న్యాయవాదిగా పనిచేస్తున్న సుబ్రమణియన్, ఏళ్ల తరబడి ల్యాండ్ ఫోన్ వాడుతున్నారు. అయితే, ఈమధ్య ఆఫోన్ చేయలేదు. నాలుగు నెలలుగా BSNL పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేశారు సుబ్రమణియన్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, BSNL నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ లాయర్, వినూత్న నిరసనకు దిగారు. BSNL కనెక్షన్ పనిచేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సుబ్రమణియన్, ఫోన్‌కి దండ వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఏకంగా, రాయపురం సెంటర్‌లో సంతాప సభను ఏర్పాటు చేసి, తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
వైరల్ వీడియో..
నడిరోడ్డుపై న్యాయవాది చేసిన నిరసనకి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. కస్టమర్లకు సర్వీస్ చేయని సిబ్బందికి మంచిగా బుద్ధి చెప్పారని లాయర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: