Watch Video: చందమామ పెరట్లో ఆడుకుంటున్న రోవర్ చిన్నారి.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ఇస్రో

|

Aug 31, 2023 | 5:06 PM

చందమామ దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనల్లో నిమగ్నపోయింది. ఎప్పటికప్పుడు అక్కడ గుర్తించిన వాటిని ఇస్రోకు పంపుతూనే ఉంది. అయితే 14 రోజల కాలవ్యవధిలో చంద్రునిపై రోవల్ పూర్తి చేయాల్సిన పరిశోధనలు చాలానే ఉన్నాయి. అందుకే రోవర్ జాబిల్లిపై అటూ ఇటు తిరుగుతూ తన అన్వేషణలు కొనసాగిస్తోంది. బండరాళ్లు, బిలాలతో ఉన్నటువంటి చంద్రునిపై తాను వెళ్లాల్సిన సురక్షిత మార్గాన్ని కూడా రోవర్ సక్రమంగా ఎంచుకుంటోంది.

Watch Video: చందమామ పెరట్లో ఆడుకుంటున్న రోవర్ చిన్నారి.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ఇస్రో
Chandrayaan 3
Follow us on

చందమామ దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన పరిశోధనల్లో నిమగ్నపోయింది. ఎప్పటికప్పుడు అక్కడ గుర్తించిన వాటిని ఇస్రోకు పంపుతూనే ఉంది. అయితే 14 రోజల కాలవ్యవధిలో చంద్రునిపై రోవల్ పూర్తి చేయాల్సిన పరిశోధనలు చాలానే ఉన్నాయి. అందుకే రోవర్ జాబిల్లిపై అటూ ఇటు తిరుగుతూ తన అన్వేషణలు కొనసాగిస్తోంది. బండరాళ్లు, బిలాలతో ఉన్నటువంటి చంద్రునిపై తాను వెళ్లాల్సిన సురక్షిత మార్గాన్ని కూడా రోవర్ సక్రమంగా ఎంచుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా ఇస్రో ట్వట్టర్‌లో షేర్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఇస్రో రోవర్ తిరుగుతున్న మరో స్పెషల్‌ వీడియోను షేర్ చేసింది. సురక్షిత మార్గాన్ని ఎంచుకుంటూ రోవర్ తిరుగుతోంది. ఇలా తిరుగుతుండగా ల్యాండర్ ఇమేజర్ కమెరా బంధించింది. తల్లి ఆప్యాయంగా చూస్తుండగా.. జాబిల్లి పెరట్లో చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లు ఉంది కదా అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

ఇదిలా ఉండగా జాబిల్లి దక్షిణ ధ్రువానికి సమీపంలో మొదటగా జరిగిన పరిశోధనల్లో సల్ఫర్ ఉన్నట్లు రోవర్‌లోని లేజర్ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (లిబ్స్‌) గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ప్రజ్ఞాన్ రోవర్‌లో ఉన్న మరో పరికరం కూడా దీన్ని ధ్రువీకరించింది. ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్‌ అనే పరికరం కూడా సల్ఫర్ ఉన్నట్లు గుర్తించిందని ఇస్రో తెలిపింది. అయితే అక్కడ ఈ సల్ఫర్ ఎలా వచ్చింది.. అంతర్గతంగానే అక్కడ ఉందా.. లేదా అగ్నిపర్వతం లేదా ఉల్కల వల్లనా అనే విషయాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది. అలాగే జాబిల్లిపై ఆక్సిజన్, ఐరన్, టైటానియం, క్రోమియం, కాల్షియం లాంటి ఖనిజాలు కూడా ఉన్నట్లు రోవర్ గుర్తించింది. ఈ విషయాన్ని కూడా ఇస్రో ట్వట్టర్‌లో షేర్ చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..