AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఛీ.. ఛీ.. ఇద్దరితో రొమాన్స్ చేస్తూ కనిపించిన భార్య.. ఆ డాక్టర్ ఏం చేశాడంటే..?

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను హోటల్‌లో కొట్టిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఓ వైద్యుడు తన భార్యను ఇద్దరు వ్యక్తులతో హోటల్‌లో రొమాన్స్ చేస్తుండగా పట్టుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వారికి దేహశుద్ది చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral: ఛీ.. ఛీ..  ఇద్దరితో రొమాన్స్ చేస్తూ కనిపించిన భార్య.. ఆ డాక్టర్ ఏం చేశాడంటే..?
Extramarital Affair
Ram Naramaneni
|

Updated on: May 13, 2024 | 7:38 PM

Share

వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో అందమైన కుటుంబాలు నాశనమవుతున్నాయి. క్షణికమైన సుఖం కోసం.. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు కొందరు. తాజాగా అలాంటి ఓ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత ఒకరు కాదు.. ఇద్దరు వ్యక్తులతో హోటల్ గదిలో సరసాలాడుతుండగా భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వారిని అలా చూసిన తర్వాత అతడికి కోపం నషాలానికి అంటుకుంది.  ముగ్గురిని చెప్పుతో పిచ్చి కొట్టుడు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో చోటుచేసుకుంది.

భార్యభర్తలు ఇద్దరూ వైద్యులే. కుటుంబ కలహాల కారణంగా ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు.  భార్య ప్రవర్తన సరిగా లేదని భావించిన డాక్టర్ భర్త ఆమెపై నిఘా పెట్టాడు. ఇటీవల ఓ ప్రాంతానికి వెళ్తున్న ఆమెను ఫాలో అయ్యాడు. చివరికి ఆమె ఓ హోటల్‌కి చేరుకుంది. అక్కడి రూమ్‌లో తన భార్య బులంద్‌షహర్, ఘజియాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఏకకాలంలో సరసాలాడుతున్న దృశ్యాన్ని చూడటంతో కంగుతిన్నాడు. కోపంతో ఊగిపోతూ ముగ్గురకీ దేహశుద్ది చేశాడు.  అనంతరం ఈ ముగ్గురిపై భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ మహిళ ఇప్పటి వరకు ఎలాంటి కౌంటర్‌ ఫిర్యాదు చేయలేదని సమాచారం.

ఘటనకు సంబంధించిన వీడియో @NCMIndiaa అనే పేరు గల X ఖాతాలో షేర్ చేశారు. మే 10న షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇది కచ్చితంగా ఓ భర్తను బాధించే పరిస్థితి అని మరొకరకు పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..