Watch Video: క్లాస్‌లో పాఠం వింటూ కుప్పకూలిన విద్యార్థి.. ఆస్పత్రికి తరలించేలోపుగానే.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

అయితే అప్పటికి అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రాజాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన అంతా తరగతి గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రాజా స్పృహతప్పి పడి చనిపోతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Watch Video: క్లాస్‌లో పాఠం వింటూ కుప్పకూలిన విద్యార్థి.. ఆస్పత్రికి తరలించేలోపుగానే.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
College Student Collapses

Updated on: Jan 19, 2024 | 11:28 AM

క్లాస్‌లో పాఠాలు వింటున్న విద్యార్థి తరగతి గదిలోనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. తరగతి గదిలో విద్యార్థి కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధమవుతున్న రాజా అనే యువకుడు.. భవార్కువాలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఎప్పటిలాగే రాజా కోచింగ్ సెంటర్‌కి వచ్చి క్లాస్‌రూమ్‌లో కూర్చుని పాఠం వింటున్నాడు. అయితే అకస్మాత్తుగా తరగతి గదిలో స్పృహతప్పి పడిపోయాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారటంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన రాజా (18) మరణించిన విద్యార్థి.. ఉన్నత చదువుల కోసం ఇండోర్‌లో స్థిరపడ్డాడు. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న రాజా గురువారం ఉదయం ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యాడు. ఈక్రమంలోనే అతను గుండెపోటుతో మరణించాడు.

ఇవి కూడా చదవండి

రాజా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. భవార్కువాలోని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఎప్పటిలాగే రాజా గురువారం ఉదయం కోచింగ్ సెంటర్‌కు వచ్చి తరగతి గదిలో కూర్చుని పాఠం వింటున్నాడు. అయితే అకస్మాత్తుగా క్లాస్‌ రూమ్‌లోనే స్పృహతప్పి పడిపోయాడు. ఛాతీ నొప్పితో బాధపడుతూ కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు అతడిని లేపి బెంచీపై కూర్చోబెట్టారు. అయితే అప్పటికి అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రాజాను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన అంతా తరగతి గదిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రాజా స్పృహతప్పి పడి చనిపోతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి