Viral Video: తనను తాను చిరుత పులిలా ఊహించుకున్న ‘పిల్లి’.. కట్ చేస్తే పిచ్చుక ఎంట్రీ.. అంతా ‘ఫసక్’..

|

Sep 12, 2022 | 6:09 AM

Viral Video: సోషల్ మీడియాలో మనం నిత్యం అనేక ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. కొన్ని కొన్ని వీడియో చూస్తుంటే అస్సలు నవ్వు ఆపుకోలేని పరిస్థితి ఉంటుంది.

Viral Video: తనను తాను చిరుత పులిలా ఊహించుకున్న ‘పిల్లి’.. కట్ చేస్తే పిచ్చుక ఎంట్రీ.. అంతా ‘ఫసక్’..
Cat
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో మనం నిత్యం అనేక ఫన్నీ వీడియోలను చూస్తుంటాం. కొన్ని కొన్ని వీడియో చూస్తుంటే అస్సలు నవ్వు ఆపుకోలేని పరిస్థితి ఉంటుంది. చాలా వినోదభరితంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో పిల్లి చేసిన వింత పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా వేటకు ముందు జంతువులు మాటు వేసి, ఆ తరువాత అదునుచూసి మెరుపుదాడి చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధానం పిల్లికి కూడా వర్తిస్తుందనే చెప్పాలి. అడవి జంతువులైన సింహం, పులి జాతి నుంచి పిల్లులు వచ్చాయని, వాటి మధ్య చాలా పోలికలు ఉంటాయని చెబుతుంటారు. అడవి జంతువులైన సింహం, పులి మాదిరిగానే.. పిల్లులు కూడా తమ ఆహారాన్ని వేటాడుతుంటాయి. ఈ విషయం చాలా సందర్భాల్లో చూశాం కూడా.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో గింజలు తింటున్న పక్షిని పిల్లి గమనించింది. ఆ పక్షిని తన ఆహారంగా చేసుకోవాలనుకుంది పిల్లి. ఇంకేముందు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేటకు సిద్ధమైంది. అచ్చం చిరుత పులిలా మాటు వేసింది. తనను తాను చిరుత పులిలా ఊహించుకుందో ఏమోగానీ.. గోడ చాటున మాటు వేసి, గింజలు తింటున్న పక్షిపై అటాక్ చేసేందుకు సిద్ధమైంది. పక్షి అక్కడ ఉన్న గింజలు మేస్తూ అటూ ఇటూ తిరుగుతుండగా.. పిల్లి సమయం కోసం, అదునుకోసం తీవ్రంగా చూస్తోంది. అలా చూసింది.. చూసింది.. చూసింది.. చూస్తూనే ఉంది. పక్షి తన పని తాను చేస్తూనే ఉంది. ఇంతలో పక్షి ఉన్నట్లుండి.. మాటు వేసిన పిల్లి వద్దకు వచ్చింది. ఒక్కసారిగా పక్షి ఎంట్రీతో పిల్లి బిత్తరపోయింది. తొలుత పక్షిని, పిల్లి పట్టేస్తుందని అనిపించినా.. తుస్సుమనిపించింది. పక్షిని చూసి ఆ పిల్లి జడుసుకుంది. పై నుంచి కింద వరకు పక్షి పరీక్షించి చూడగా.. బెదిరిపోయిన పిల్లి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ సీన్‌ అంతా అక్కడి కెమెరాలో రికార్డ్ అవగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. పులిలా బిల్డప్ ఇచ్చిన పిల్లి చివరకు తుస్సుమనిపించిందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..