Find The Cat: ఇప్పుడున్న సోషల్ మీడియా(Social Media) యుగంలో టైమ్ పాస్ చెయ్యడానికి మార్గాలు కోకొల్లలు. అందులో పజిల్స్ కూడా ఒక మెథడ్. పజిల్స్ ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. మెదడుకు మేతలా, ఆలోచన శక్తిని పెంచేలా ఉంటాయి. మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పదాల పజిల్స్ ఓ రకం. వీటిని భాషపై నాలెడ్జ్.. కాస్త క్లవర్ మైండ్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. కానీ ఫోటో పజిల్స్(Photo Puzzles) పరిష్కరించాలంటే కాస్త టైమ్ వెచ్చించాల్సిందే. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో దాగి ఉన్న జంతువులను గుర్తించండంటూ సవాళ్లు విసురుతున్నారు. నెటిజన్లు కూడా ఈ ఫొటోలకు తెగ అట్రాక్ట్ అవుతున్నారు. చాలామంది పజిల్ కనిపిస్తే.. దాని అంతుచూసేవరకు వదిలిపెట్టరు. దాన్ని సాల్వ్ చేస్తే అదో రకమైన సంతృప్తి దొరకుతుంది. చాలెంజింగ్ స్వీకరిస్తూ మరీ ఫొటోల్లోని జంతువులను గుర్తించేందుకు ఇప్పుడు చాలామంది నెటిజన్లు పోటీపడుతున్నారు. కొన్నిసార్లు అయితే సాల్వ్ చేయడం అసాధ్యం అనే చెప్పాలి. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పవర్ ఉండాలి. బుర్ర యాక్టివ్‌గా వర్క్ చేయాలి. తాజాగా ఇలాంటి మరో పజిల్ ఒకటి వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే..?
పైన ఫొటోలో నరికిన చెట్ల దుంగలు ఒకచోట పేర్చి కనిపిస్తున్నాయి కదూ!. అయితే ఈ దుంగల్లో ఓ పిల్లి హాయిగా సేద తీరుతోంది. ఆ కర్రల రంగులోనే కలిసిపోయిన ఓ పిల్లి దాగి ఉంది. మీకూ ఆ పిల్లి కనిపిస్తుందేమో ఓ సారి ట్రై చేయండి. నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఏంటీ ఎంత ట్రై చేసినా పిల్లి కనిపించడం లేదా. అయితే కింద ఉన్న ఫొటోను చూడండి. రెస్ట్ తీసుకుంటున్న ఆ క్యాట్ కనిపించింది కదూ. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ స్నేహితులకు కూడా షేర్ చేసి వారికి ఛాలెంజ్ విసరండి. ఈ పజిల్ పాతదే అయినప్పటికీ మరోసారి నెట్టింట ట్రెండింగ్ గా మారింది.