Viral Video: ధైర్యమున్నోళ్లే చూడండి.. యముడు జస్ట్ బ్రేక్ ఇచ్చాడనుకుంటా.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్..

|

Nov 13, 2024 | 12:57 PM

ముఖ్యంగా వాహనదారుల నిర్లక్ష్యం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపడం, పొగ మంచు వంటి కారణాలతో దేశ వ్యాప్తంగా ఏటా 4 లక్షలకు పైనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో కనీసం లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటున్నారు..

Viral Video: ధైర్యమున్నోళ్లే చూడండి.. యముడు జస్ట్ బ్రేక్ ఇచ్చాడనుకుంటా.. ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్..
Road Accident
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ .. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరిగిపోతున్నాయి.. ఏటా లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.. ముఖ్యంగా వాహనదారుల నిర్లక్ష్యం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపడం, పొగ మంచు వంటి కారణాలతో దేశ వ్యాప్తంగా ఏటా 4 లక్షలకు పైనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో కనీసం లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటున్నారు.. అయితే.. ఏటేటా ప్రమాదాలు భారీగా పెరగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్ ను .. స్పీడుగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది.. దీంతో బైకర్ ఎగిరి పడ్డాడు.. ఆ తర్వాత కారు పల్టీలు కొడుతూ దూసుకెళ్లి రోడ్డు వెంట బోల్తాపడింది..ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని కంబాలబెట్టు వద్ద జరిగింది.. బైక్, కారు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో అదృష్టవశాత్తూ అటు బైకర్, కారు డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

వీడియో చూడండి..

బైకర్ లోపలి రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుపైకి వస్తుండగా వేగంగా వచ్చిన కారు డ్రైవర్.. బైక్‌ను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా.. ఫలితం లేకపోయింది.. ఈ క్రమంలోనే బైకర్ ను ఢీకొట్టిన కారు అదుపు తప్పింది.. అక్కడే ఆగి ఉన్న మరో బైక్‌ను కారు ఢీకొని బోల్తా పడింది. తరువాత, అది ఒక మట్టి దిబ్బ మీద పడిపోయింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సనత్ పావాడ సురక్షితంగా బయటపడగా, బైక్ రైడర్ యతీష్‌ను పుత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.

వీడియో చూడండి..

దీనికి సంబంధించిన వీడయో నెట్టింట వైరల్ అవుతోంది..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..