Optical Illusion: ఈ స్నోమెన్‌ బొమ్మల మధ్య ఓ పాండా నక్కి ఉంది.. కనిపెట్టగలరేమో ట్రై చేయండి..

|

May 10, 2022 | 8:20 PM

Optical Illusion: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్ పేరుతో వైరల్‌ అవుతోన్న ఫొటోలు ఒకటి. చూసే కళ్లనే మాయ చేసే ఇలాంటి ఇల్యూజన్‌ ఫొటోలు నెటిజన్లను తికమక పెడుతూ..

Optical Illusion: ఈ స్నోమెన్‌ బొమ్మల మధ్య ఓ పాండా నక్కి ఉంది.. కనిపెట్టగలరేమో ట్రై చేయండి..
Follow us on

Optical Illusion: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి రకరకాల ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి ఆప్టికల్‌ ఇల్యూజన్ పేరుతో వైరల్‌ అవుతోన్న ఫొటోలు ఒకటి. చూసే కళ్లనే మాయ చేసే ఇలాంటి ఇల్యూజన్‌ ఫొటోలు నెటిజన్లను తికమక పెడుతూ వారిని థ్రిల్‌కు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఫొటోలు రోజుకోటి నెట్టింట హంగామా చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కొందరు వ్యక్తులు ఇలాంటి ఫొటోలను పోస్ట్‌ చేయడానికే ప్రత్యేకంగా పేజీలు కూడా మెయింటెన్‌ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఇలాంటి వాటికి పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు.

తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లు ఆకట్టుకుంటోంది. పైన కనిపిస్తున్న ఫొటోలో పెద్ద సంఖ్యలో స్నోమెన్‌ బొమ్మలు కనిపిస్తున్నాయి కదూ! కానీ ఓసారి తీక్షణంగా గమనించండి మీకు ఈ ఫొటోలో ఓ పాండా కనిపిస్తుంది. స్నోమెన్‌ బొమ్మల నడుమ నక్కినక్కి చూస్తున్న పాండా నన్ను గుర్తుపట్టండి అంటూ నెటిజన్లకు సవాల్‌ విసురుతున్నట్లు ఉంది. అయితే ఆప్టికల్‌ ఇల్యూజన్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా అన్ని ఒకే రకమైన బొమ్మల నడుమ భిన్నంగా ఉన్న మరో బొమ్మను గుర్తించడం కాస్త కష్టమనే చెప్పవచ్చు.

హంగేరియాకు చెందిన గెర్గెలీ డుడాస్‌ అనే కళాకారుడు రూపొందించిన ఈ ఫొటో పజిల్‌ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఇందులో ఉన్న ఆ పాండాను గుర్తుపట్టారా లేదా? అయితే ఓసారి రైట్‌ సైడ్‌ అజ్వర్‌ చేయండి మధ్యలో ఆ పాండా కనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా కనిపించకపోతే సమాధానం కోసం కింద ఉన్న ఫొటోలో చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..