Optical Illusion: ఈ ఫోటో వెనుక దాగున్న మిస్టరీ ఏంటో కనిపెట్టండి.. బుర్ర వేడెక్కిపోవాల్సిందే!

ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రంలో కనిపించేది మీకు చిలుక.. కాని దాగున్నది మిస్టరీ.. మీరు 5 సెకన్లలో గుర్తించగలరా?..

Optical Illusion: ఈ ఫోటో వెనుక దాగున్న మిస్టరీ ఏంటో కనిపెట్టండి.. బుర్ర వేడెక్కిపోవాల్సిందే!
Parrot

Updated on: Sep 17, 2022 | 6:58 PM

కళ్లను మభ్యపెట్టడమే కాదు.. మనసును కూడా తికమక పెట్టేస్తుంటాయి ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు. పైకి కనిపించేది మాత్రమే నిజమని.. అది మనకు కనిపిస్తోందంటూ.. మనల్ని ఫూల్స్ చేసేస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మనం చూసే దృక్కోణం ఎలాంటిదో చెప్పెస్తాయని మానసిక నిపుణులు అంటుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా ఇవే.. మన మెదడుకు పరీక్ష పెడుతూ సవాల్‌ను విసురుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో మీకేం కనిపిస్తోంది.? ఎంచక్కా చెట్టు కాండంపై కూర్చున్న చిలుక అని ఠక్కున చాలామంది సమాధానం ఇస్తారు. ఈ ఫోటోను Johannes Stoetter అనే ఫోటోగ్రాఫర్ తీశాడు. అయితే ఇందులో మీకు పైకి కనిపించేది చిలుక అయితే.. అంతర్లీనంగా ఓ మహిళ దాగుందని అంటున్నాడు. మరి ఆ మహిళను మీరు గుర్తించగలరా.! ఫోటోను పైపైన కాకుండా తీక్షణంగా చూడండి.. మీకు కనిపిస్తుంది.. ఒకవేళ ఎంత వెతికినా దొరకలేదు.. అయితే సమాధానం కోసం కింద ఫోటో చూడండి..