Viral Photo: కొండల మధ్య జింకను కనిపెట్టండి.. చాలామంది గుర్తించలేక ఫెయిల్ అయ్యారు..

సాధారణంగా మనకి బోర్ కొడుతున్నప్పుడు ఏదైనా వెబ్ సిరీస్ చూడటం గానీ, లేదా మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడటం గానీ చేస్తుంటాం...

Viral Photo: కొండల మధ్య జింకను కనిపెట్టండి.. చాలామంది గుర్తించలేక ఫెయిల్ అయ్యారు..
Spot The Deer
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 19, 2021 | 10:51 AM

సాధారణంగా మనకి బోర్ కొడుతున్నప్పుడు ఏదైనా వెబ్ సిరీస్ చూడటం గానీ, లేదా మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడటం గానీ చేస్తుంటాం. కొందరైతే మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లలోని పజిల్స్, సుడోకోలను సాల్వ్ చేస్తూ బోర్ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి టైం పాస్ చేస్తుంటారు. పజిల్స్ మనలో ఆసక్తిని పెంచుతాయి. వాటిని సాల్వ్ చేయడం ద్వారా మన మెదడు మేత.. కళ్లకు పదును రెండూ కూడా అందుతాయి.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా.. ‘ఈ ఫోటోలో ఏదో జంతువు దాగుంది’.. ‘ఈ ఫోటోలో సింహాన్ని కనిపెట్టండి’ అంటూ పలు రకాల పజిల్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వీటిపై జనాలు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..

పైన ఫోటోలో ఓ జింక దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చూడటానికి కొండ లాంటి ప్రాంతంగా కనిపిస్తున్న ఆ ఎత్తైన ప్రదేశంలో ఓ జింక ఇంచక్కా సేద తీరుతోంది. ఎక్కువగా రాళ్లు ఉండటం.. పైగా వాటి రంగులో, జింక చర్మం రంగు కూడా కలిసిపోవడంతో దాన్ని తొందరగా కనిపెట్టలేరు. అయితే తీక్షణంగా చూస్తే మాత్రం అదెక్కడ ఉందో గుర్తించవచ్చు. చాలామంది ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేశారు. ఫస్ట్ ట్రయిల్‌లోనే సక్సెస్ అయ్యారు. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గుర్తించలేకపోతే.. సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..