Viral Photo: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ట్రెండ్ నడుస్తుంది. రకరకాల ఛాలెంజ్స్‌తో సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఫొటో పజిల్స్ గురించి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలే నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫొటోల్లో దాగున్న జంతువులను గుర్తించండి అంటూ కొన్ని పోస్ట్‌లు నెటిజన్లకు సవాలు విసురుతున్నాయి. కొందరు ఔత్సాహికులు ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్లను ఓపెన్ చేసి మరీ ఛాలెంజ్‌లను విసురుతున్నారు.
నెటిజన్లు సైతం ఎంతో క్యూరియాసిటీతో ఇలాంటి ఛాలెంజ్‌లను ఓ పట్టుపడుతాం అంటూ రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వైరల్ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది. ఇంట్లో హాల్‌లో ఉండే ఓ సెల్ఫ్‌లన్నీ పుస్తకాలు, బొమ్మలు, టీవీతో నిండిపోయాయి. అయితే వాటి మధ్యలో ఓ పిల్లి ఎంచక్కా సేద తీరుతోంది. గుర్తించండి అని ఛాలెంజ్ విసిరారు.
Today in find the cat pic.twitter.com/P6soGOv8k1
— Kate Hinds (@katehinds) June 7, 2020
మరి పైన కనిపిస్తోన్న ఫొటోలో పిల్లి ఎక్కడుందో మీకు కనిపించిందా.? అంత సింపుల్‌గా కనిపిస్తే దానిని పజిల్ అని ఎందుకు అంటారు చెప్పండి. ఓసారి జాగ్రత్తగా మధ్యలో ఉన్న టీవీకి కుడివైపున కింద భాగంలో చూడండి… కనిపించిందా. బహుశా వాతావరణం చల్లాగా ఉందనేమో పిల్లి నక్కి నక్కి సేద తీరుతోంది. ఇన్ని క్లూస్ ఇచ్చినా సమాధానం లభించకపోతే జవాబు కోసం కింద ట్వీట్‌ను చూడండి.
— Kate Hinds (@katehinds) June 7, 2020
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..