Optical illusion: ఈ ఫొటోలో ’88’ నెంబర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం.?
ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు నెట్టింట బాగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మన ఐ పవర్‌తో పాటు థింకింగ్ పవర్‌ను టెస్ట్ చేసే ఫొటో పజిల్స్ నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్వాయామం అంటే కేవలం శరీరానికి మాత్రమే అనే ఆలోచనలో ఉంటాం. అయితే మెదడుకు కూడా వ్యాయామం అవసరమని నిపుణులు చెబుతున్నారు. మెదడుకు వ్యాయామం ఏంటని ఆలోచిస్తున్నారా.? అదేనండి మెదడుకు మేత అని చెబుతుంటారు చూడండి అదే.
అప్పుడప్పుడు మెదడుకు కూడా పని చెప్పండి అంటుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతీ చిన్న పనికి స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. చిన్న లెక్క కోసం క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తున్నారు. దీంతో మెదడుకు పని తగ్గుతోంది. అయితే ఇదే డిజిటల్ యుగంలో మెదడుకు పని చెప్పే కొన్ని పజిల్స్ వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్ పేరుతో నెట్టింట ఇటీవల కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఇలాంటి ఫొటోలకు భారీగా ఆదరణ లభిస్తోంది. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో కొన్ని మన కంటి చూపును పరీక్షిస్తే, మరికొన్ని ఆలోచన శక్తికి పదును పెడుతుంటాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్ అవుతోంది. చూసే కళ్లతోపాటు మెదడును సైతం టెస్ట్ చేస్తోంది. ఇంతకీ ఆ ఫొటో పజిల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన కనిస్తున్న ఫొటో చూడగానే సహజంగా ఏం కనిపిస్తోంది.. ఏముంది ’89’ నెంబర్ అంటారు కదూ! అయితే వీటిలో 88 నెంబర్ దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం 10 సెకండ్లలో ఈ నెంబర్‌ను కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అని అర్థం చేసుకోవాలి. ఇంతకీ మీరు పజిల్‌ను సాల్వ్ చేశారా.? ఎంత ప్రయత్నించినా కనిపించడం లేదా.? అయితే ఓసారి 5వ లైన్‌ను గమనించండి అందులోనే మీరు వెతుకుతోన్న నెంబర్ దాగి ఉంది. ఇంత చెప్పినా పజిల్ సాల్వ్ చేయలేకపోతే.. సమాధానం కోసం కింద చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..