పాము విషానికి ఒంటె కన్నీరు విరుగుడట.. ఇది నిజమేనా.? పూర్తి వివరాలు..

|

Feb 22, 2024 | 9:26 AM

సాధారణంగా పాములన్నీ విషపూరితాలు కావు. కొన్ని విషపూరితమైన పాములు కాటు వేసినప్పుడు క్షణాల్లో ప్రాణాలు పోతాయి.. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

పాము విషానికి ఒంటె కన్నీరు విరుగుడట.. ఇది నిజమేనా.? పూర్తి వివరాలు..
Camel Tears
Follow us on

సాధారణంగా పాములన్నీ విషపూరితాలు కావు. కొన్ని విషపూరితమైన పాములు కాటు వేసినప్పుడు క్షణాల్లో ప్రాణాలు పోతాయి.. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా పాముకాటుతో లక్షలమంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా పాముకాటుకు ఒంటె కన్నీరుతో ఔషధాన్ని తయారుచేసేందుకు సిద్ధమయ్యారు దుబాయ్‌ శాస్త్రవేత్తలు.

ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. ఈ ల్యాబ్‌లో ఒంటెన్నీరుపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా కొనసాగించలేకపోయారు. తాజాగా నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని CVRL పేర్కొంది. త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు.

ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.