Cambodia: మత్య్సకారుల వలకు చిక్కిన అంతరించిపోతున్న అరుదైన చేప.. బరువు ఎంతో తెలిస్తే షాక్..

|

May 14, 2022 | 5:36 PM

ఆసియాలోని మెకాంగ్‌ నదిలో ఓ అరుదైన జాతికి చెందిన చేప మత్స్యకారుడి వలకు చిక్కింది. ఇది అంతరించిపోతున్న స్టింగ్రే జాతికి చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Cambodia: మత్య్సకారుల వలకు చిక్కిన అంతరించిపోతున్న అరుదైన చేప.. బరువు ఎంతో తెలిస్తే షాక్..
Cambodian Fishermen
Follow us on

Cambodia: సముద్రం ఎప్పుడూ అనేక వింతలు విశేషాలు అద్భుతాలకు నెలవు. ఇక సముద్రంలో నివసించే జీవుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. చిన్నవి పెద్దవి. విషపూరితమైన ఇలా అనేక రకాల చేపలు సముద్రంలో జీవిస్తాయి. గత కొంత కాలంగా మత్సకారుల వలలో రకరకాల చేపలు పడుతున్నాయి. తాజాగా ఆసియాలోని మెకాంగ్‌ నదిలో ఓ అరుదైన జాతికి చెందిన చేప మత్స్యకారుడి వలకు చిక్కింది. ఇది అంతరించిపోతున్న స్టింగ్రే జాతికి చెందినదిగా చెబుతున్నారు. స్టింగ్‌రే జాతి చేపలు మామూలు చేపల్లా కాకుకండా కొంచెం భిన్నంగా ఉంటాయి. ఉష్ణమండల ప్రాంతాలలో ఉండే సముద్ర జలాల్లో కాస్త లోతు తక్కువగా ఉండే చోట ఈ స్టింగ్రే చేపలు నివసిస్తుంటాయి. ఇక్కడ దాదాపు 60 రకాల స్టింగ్రేలు ఇక్కడ కనిపిస్తాయి. వీటి పొడవు దాదాపు 6.5 అడుగులు ఉంటే, బరువు మాత్రం 350కిలోల వరకు ఉంటుంది. వీటికి గట్టి ఎముకలతో కూడాన అస్థిపంజరం ఉండదు. దీని శరీరం మెత్తటి ఎముకలతో కూడి ఉంటుంది.

కంబోడియా ఈశాన్య ప్రావిన్స్‌లోని నదీ జలాల్లో దొరికిన ఈ చేప.. నాలుగు మీటర్ల పొడవు, 180 కిలోల బరువు ఉండటంతో కంబోడియన్ మత్స్యకారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాగా ఈ స్టింగ్రే ఫిష్ ఆగ్నేయాసియాలోని అతిపెద్ద, అరుదైన చేపల జాతుల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న అంతర్జాతీయ నిపుణుల బృందం. చేప పొడవు, బరువును కొలిచి తిరిగి నీటిలో విడిచిపెట్టారు. కాగా ఈ చేప గురించి నిపుణుల బృందంలోని ఓ పరిశోధకురాలు ‘ఇంటి దగ్గర ఈత కొడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు జెయింట్ స్టింగ్రేను నీటిలో విడుదల చేయడం కూడా అంతే ఆనందంగా, అద్భుతంగా ఉందన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడయోలో చేపను చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..