ఓరీ దేవుడో… అది నాలుకా..? నాగు పామా..? ప్రపంచంలోనే అతి పొడవైన నాలుకతో గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళ..

ఆమె తన తల్లితో హాలోవీన్ ఫోటో సెషన్ చేస్తున్నప్పుడు ఆ విషయం తెలిసిందని చెప్పాంది. హాలోవీన్ ఫోటో చూసినప్పుడు తన నాలుక అసాధారణంగా పొడవుగా ఉన్నట్టుగా గుర్తించానని చెప్పింది. ఇక, ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో రికార్డు బద్దలు కొట్టే నాలుక ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమె వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది, ఆ తర్వాత ఆమె మరింత వైరల్ అయింది.

ఓరీ దేవుడో... అది నాలుకా..? నాగు పామా..? ప్రపంచంలోనే అతి పొడవైన నాలుకతో గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళ..
Longest Tongue

Updated on: Apr 01, 2025 | 12:53 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ ప్రత్యేకమైన రికార్డులను సృష్టిస్తారు. కొందరు నీటిలో ఎక్కువసేపు ఊపిరి బిగపట్టి రికార్డులు సృష్టిస్తే, మరికొందరు పొడవాటి గోళ్లను పెంచి రికార్డులు సృష్టిస్తారు. అదే క్రమంలో కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ తన 9.75 సెం.మీ (3.8 అంగుళాలు) పొడవైన నాలుకతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఐఫోన్ అంత పొడవున్న ఆమె అసాధారణ నాలుక ఇంటర్నెట్‌ వేదికగా ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. దీంతో కాలిఫోర్నియాకు చెందిన చానెల్ టాపర్ అనే విద్యార్థిని ఇప్పటివరకు చూసిన మహిళల్లో అత్యంత పొడవైన నాలుక కలిగిన మహిళగా రికార్డు సృష్టించింది.

టాపర్ తన పొడవైన నాలుక గురించి 8 సంవత్సరాల వయసులో మొదటిసారి తెలుసుకున్నానని చెప్పింది.. ఆమె తన తల్లితో హాలోవీన్ ఫోటో సెషన్ చేస్తున్నప్పుడు ఆ విషయం తెలిసిందని చెప్పాంది. హాలోవీన్ ఫోటో చూసినప్పుడు తన నాలుక అసాధారణంగా పొడవుగా ఉన్నట్టుగా గుర్తించానని చెప్పింది. ఇక, ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో రికార్డు బద్దలు కొట్టే నాలుక ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఆమె వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది, ఆ తర్వాత ఆమె మరింత వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, గతంలో అమెరికాకు చెందిన నిక్ స్టోబెర్ల్ అత్యంత పొడవైన నాలుక (పురుషుడు) కలిగిన వ్యక్తిగా రికార్డు ఉంది. అతని నాలుక పొడవు 10.1 సెం.మీ (3.97 అంగుళాలు).

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..