Viral News: ప్రియురాలికి బ్రేకప్.. ఖర్చులకు జీఎస్టీ కలిపి మరీ లిస్టు పంపిన ప్రియుడు.. వీడియో వైరల్

|

May 30, 2024 | 10:29 AM

విడిపోయినప్పుడు కొంతమంది ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే కలిసి ఉన్నప్పుడు పెట్టిన ఖర్చులు విడిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకునే వారు ఉంటారు. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి తన ప్రేమ .. తను పెట్టిన ఖర్చులను లెక్కించుకున్నాడు. దీంతో తన మాజీ ప్రియురాలి నుంచి ఖర్చులు వసూలు చేయాలనీ భావించుకున్నాడు. ప్రస్తుతం అటువంటి కేసు ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఈ వార్త ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తుంది.

Viral News: ప్రియురాలికి బ్రేకప్.. ఖర్చులకు జీఎస్టీ కలిపి మరీ లిస్టు పంపిన ప్రియుడు.. వీడియో వైరల్
Love Breakup Viral News]
Follow us on

ప్రస్తుతం మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక బంధాలే అన్నాడు కార్ల్ మార్క్స్ .. అవును బంధాలు, అనుబంధాలు క్షణాల్లో మాయమైపోతున్నాయి. అవి క్షణాల్లో నింగి నుంచి నేల జారుతున్నాయి. కొన్ని సంబంధాలు కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు మాత్రమే కొనసాగుతాయి, ఆపై విడిపోతాయి. సాధారణంగా విడిపోయిన తర్వాత ఒక అబ్బాయి, అమ్మాయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేయడం, విడిపోయినప్పుడు కొంతమంది ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే కలిసి ఉన్నప్పుడు పెట్టిన ఖర్చులు విడిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకునే వారు ఉంటారు. అయితే ఇప్పుడు ఒక అబ్బాయి తన ప్రేమ .. తను పెట్టిన ఖర్చులను లెక్కించుకున్నాడు. దీంతో తన మాజీ ప్రియురాలి నుంచి ఖర్చులు వసూలు చేయాలనీ భావించుకున్నాడు. ప్రస్తుతం అటువంటి కేసు ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఈ వార్త ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తుంది.

ఆన్ లైన్ లో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక CA కుర్రాడు బ్రేకప్ తర్వాత తన మాజీ ప్రియురాలికి ఖర్చుల గురించి సుదీర్ఘ జాబితాను పంపి డబ్బును తిరిగి ఇవ్వమంటూ డిమాండ్ చేశాడు. ఆ లిస్ట్‌లో ప్రయాణ క్యాబ్ ఖర్చులు, సినిమాలు చూడటం, కాఫీ తాగడం మొదలైనవి ఉన్నాయి. తమాషా ఏంటంటే అబ్బాయి ఖర్చుల ఎక్సెల్ షీట్ తయారు చేసి అమ్మాయికి పంపించి ఒక్కో నెలకు అయ్యిన ఖర్చులను కూడా చేర్చాడు.

ఈ ఫన్నీ పోస్ట్ వైరల్ అవుతోంది

ప్రేమికుడు తెలిపిన వివరాల ప్రకారం.. తాను ఓ అమ్మాయితో ఏడు నెలలుగా రిలేషన్ షిప్ లో ఉన్నానని.. అప్పుడు మొత్తం సుమారు రూ.లక్ష 2 వేలు ఖర్చు చేశానని చెప్పాడు. ఖర్చులను సగానికి తగ్గించిన ప్రేమికుడు.. తాను పెట్టిన ఖర్చులకు 18 శాతం జీఎస్టీని కూడా జోడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు అతడు ఖర్చుల జాబితాలో క్రాఫ్ కోసం చేసిన డబ్బులు, దోమల కోసం పెట్టిన మార్టిన్ కాయిల్ కూడా ఉన్నాయి.

ఈ ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో trolls_official అనే IDతో షేర్ చేశాడు. ఇది ఇప్పటివరకు సుమారు రెండు లక్షల వ్యూస్ ను డిఫరెంట్ కామెంట్స్ సొంతం చేసుకుంది. ఒకరు అతను సరైన పని చేసాడు.. అందులో తప్పు ఏమిటి’ అని కామెంట్ చేయగా.. మరొకరు మార్టిన్ కాయిల్‌ను కూడా వదలలేదు ఇది కదా అవేర్ నెస్ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..