Byreddy Siddharth Reddy: రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన బైరెడ్డి.. వైరల్ వీడియో

| Edited By: Anil kumar poka

Mar 10, 2022 | 11:21 AM

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.. ఏపీలో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న వైసీపీ యువనేత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన భారీగా అభిమానులు ఉన్నారు.

Byreddy Siddharth Reddy: రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన బైరెడ్డి.. వైరల్ వీడియో
Byreddy
Follow us on

Byreddy Siddharth Reddy Dance Video: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.. ఏపీ(Andhra Pradesh)లో మంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న వైసీపీ యువనేత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో బాగా ఫేమస్ అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన భారీగా అభిమానులు ఉన్నారు. మంచి వాగ్ధాటితో అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు సిద్దార్థ్. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. గత సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిపేందుకు అహర్నిశలు కృషిచేశారు. సీఎం జగన్ ప్రేమ చూరగొని.. శాప్ (ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ అయ్యాడు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా(Kurnool District) నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. అందుకే సిద్దార్థ్ రెడ్డి.. తన తమ్ముడి లాంటివాడు అని చెప్పిన జగన్.. అతనికి మంచి పదవి ఇచ్చారు. కాగా సిద్దార్థ మాట్లాడిన ఇంటర్వ్యూలు, వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సిద్దార్థ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు బైరెడ్డి. వీడియోను బట్టి చూస్తే.. ఇది అతను టీనేజ్‌లో ఉన్నప్పుడు చిత్రీకరించిందిగా తెలుస్తుంది. ఎప్పుడు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసే బైరెడ్డిలోని ఈ టాలెంట్ చూసి ఆయన ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో ఉన్నది ఏంటి..? వెంటనే కనిపెడితే మీరు తోపే… చాలా కష్టమండోయ్