వార్నీ.. ఇదేక్కడి పంచాయితీ సామీ..! ఈ చికెన్ వంటకం మాదేనంటూ కోర్టుకెక్కిన రెండు హోటల్స్‌..! కట్ చేస్తే..

|

Mar 27, 2024 | 12:23 PM

బటర్ చికెన్, దాల్ మఖానీని ఎవరు కనిపెట్టారనే వివాదం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. దేశీ దిగ్గజ వంటకాలైన బటర్ చికెన్, దాల్ మఖానీ మొదట తయారు చేసింది తామేనంటూ ఢిల్లీకి చెందిన రెస్టారెంట్ చైన్ మోతీ మహల్, దర్యాగంజ్ మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. నిజానికి, బటర్ చికెన్‌ను తొలిసారిగా ఎవరు తయారు చేశారనే దానిపై ఒక ఇంటర్వ్యూలో మోతీ మహల్ రెస్టారెంట్‌ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ రెస్టారెంట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వార్నీ.. ఇదేక్కడి పంచాయితీ సామీ..! ఈ చికెన్ వంటకం మాదేనంటూ కోర్టుకెక్కిన రెండు హోటల్స్‌..! కట్ చేస్తే..
Butter Chicken
Follow us on

Butter chicken dispute: బటర్ చికెన్, దాల్ మఖానీ పేర్లు వింటేనే మీ నోటిలో నీళ్లు వస్తాయి. హోట‌ల్‌కి వెళ్లినా ఈ రెండు వంట‌ల‌కు మ‌రింత‌గా క్రేజ్‌ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు వంటకాలపై వివాదం తలెత్తింది. రెండు రెస్టారెంట్ల మధ్య ఈ వివాదం నడుస్తోంది. అయితే ఈ వాదనకు కారణం వింటే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే..ఈ రెండు వంటకాలను ఎవరు ముందుగా తయారు చేశారనే వివాదం నడుస్తుండగా, ఇప్పుడు ఈ పంచాయతీ నేరుగా ఢిల్లీ హైకోర్టుకు చేరింది. నిజానికి, బటర్ చికెన్‌ను తొలిసారిగా ఎవరు తయారు చేశారనే దానిపై ఒక ఇంటర్వ్యూలో మోతీ మహల్ రెస్టారెంట్‌ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ రెస్టారెంట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బటర్ చికెన్, దాల్ మఖానీని ఎవరు కనిపెట్టారనే వివాదం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. దేశీ దిగ్గజ వంటకాలైన బటర్ చికెన్, దాల్ మఖానీ మొదట తయారు చేసింది తామేనంటూ ఢిల్లీకి చెందిన రెస్టారెంట్ చైన్ మోతీ మహల్, దర్యాగంజ్ మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. దాంతో ఈ వివాదం కాస్త చట్టపరమైన వివాదంగా మారి ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ రెండు రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. బటర్ చికెన్ మూలం అనే అంశంపై అంతర్జాతీయ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బటర్ చికెన్​ను ఎవరు కనుగొన్నారు అనే విషయంపై మోతీ మహల్ యజమానులు చేసిన వ్యాఖ్యలపై దర్యాగంజ్ రెస్టారెంట్‌ ఢిల్లీ హైకోర్టును అశ్రయించింది. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్‌సైట్లలోనూ ప్రచురితమైనట్టుగా పేర్కొన్నారు. దీని వల్ల తమ రెస్టారెంట్‌ గౌరవానికి భంగం కలిగిందని వారు ఆరోపించారు.

మోతీ మహల్ యజమాని తన పూర్వీకుడు దివంగత కుందన్ లాల్ గుజ్రాల్ బటర్ చికెన్, దాల్ మఖానీని కనుగొన్నారని దావా వేయగా, దర్యాగంజ్ రెస్టారెంట్‌ ఈ రెండు వంటకాల మూలం గురించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్ దాఖలు చేయాలని మోతీ మహల్ యజమానులను జస్టిస్ సంజీవ్ నరులాతో కూడిన ధర్మాసనం గత జనవరిలోనే ఆదేశించింది. అయితే ఈ విషయంపై బటర్ చికెన్, దాల్ మఖానీ మేమే కనిపెట్టాం అనే ట్యాగ్​లైన్​ను ఉపయోగించకూడదు అని దర్యాగంజ్​కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే వెబ్​సైట్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, లింకెడిన్, ఎక్స్ ఇలా అన్ని సోషల్​మీడియాల నుంచి ఆ ట్యాగ్​లైన్​ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అప్పటి నుండి వివాదం రగులుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

దీనిపై దర్యాగంజ్ రెస్టారెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ ఇంటర్వ్యూ కథనంలో తమ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని వారు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాసం మొదట అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించబడింది. తరువాత ప్రసారం చేయబడింది. ఈ కథనం ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా, దర్యాగంజ్ రెస్టారెంట్ కథనంలో ప్రచురించిన కంటెంట్ తమ రెస్టారెంట్ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాదించారు మోతీ మహల్‌ యజమాన్యం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…