Viral News: లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే ఎంత కష్టాన్ని అయినా జయించవచ్చు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఎన్ని అవాంతరాలెదురైనా ఫలితం వస్తుంది. కృషి, పట్టుదల ముందు శారీరక లోపం కూడా ఓడిపోతుంది. సరిగ్గా ఇదే జరిగింది. ముంబైలోని ఓ అంధుల పాఠశాలలో జరిగిన కృష్ణాష్ణమి వేడుకల్లో.. అంధ విద్యార్థులు ఒకరిపై ఒకరు ఎక్కి ఎంతో ఎత్తులో ఉన్న ఉట్టిని పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ లో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దృష్టి లోపం ఉన్న విద్యార్థులు దహీ హండీని జరుపుకుంటున్న వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈవీడియో ప్రజలందరి హృదయాలను తాకుతుంది.
ముంబైలోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ లో దృష్టి లోపం ఉన్న పిల్లలు కృష్ణాష్టమి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన దహీ హండీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈపాఠశాలలోనే తన భార్య పనిచేస్తోందని హర్ష గోయెంకా తన ట్విట్టర్ పోస్టులో రాశారు. పోస్టు చేసిన కొద్ది సేపటికే ఈవీడియోను వేలాది మంది లైక్ చేయడంతో పాటు.. వందలాది మంది రీట్వీట్ చేశారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థుల అద్భుత ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను విక్టోరియా మెమోరియల్ అంధుల పాఠశాలలో చదువుకున్నందుకు గర్వ పడుతున్నానంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తంమీద ఈవీడియోను చూస్తున్న వారంత ఈఅంధ విద్యార్థులకు హ్యాట్సప్ చేస్తున్నారు.
On the occasion of #Janmashtami, this ‘Dahi handi’ is performed by the visually impaired children of Victoria Memorial School for the Blind, a school where my wife works. pic.twitter.com/9HowOxtNgI
— Harsh Goenka (@hvgoenka) August 19, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..