Viral Video: ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత…

|

Apr 25, 2024 | 9:33 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియో ఫుటేజీలు మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ప్రస్తుతం, ఇలాంటి ఫన్నీ వీడియో వైరల్‌గా మారింది, ఇక్కడ కోపంతో ఉన్న ఎద్దు ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్‌లోకి దూసుకుపోయింది. ఎద్దు ప్రవేశించిన వెంటనే దుకాణం లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులు భీతితో హడలిపోయారు..

Viral Video: ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత...
Bull In Shop
Follow us on

ఎక్కడైనా, ఏదైనా విచిత్ర సంఘటన జరిగితే చాలు.. దాని గురించి క్షణాల్లో వైరల్ అవుతుంది. అందరి చేతుల్లో ఫోన్స్ ఉండటం, ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో.. ఘటనల తాలూకా వీడియో క్లిప్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. నిత్యం సామాజిక మాధ్యమాల్లో బోలెడన్ని వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. పొగరు నషాలానికి అంటిన ఎద్దు.. అకస్మాత్తుగా మొబైల్ రిపేర్ షాపులోకి ప్రవేశించింది. దాని రాకను అస్సలు ఊహించని ఇద్దరు వర్కర్స్.. ఒక్కసారిగా స్టన్ అయ్యారు. పరుగులు తీద్దామన్నా బయటకు వెళ్లలోని పరిస్థితి. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను చిరాగ్ (@chiragbarjathya) తన X ఖాతాలో పంచుకున్నారు.

వీడియో చూడండి….

 

వైరల్ వీడియోలో, ఇద్దరు యువకులు ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్‌లో పనిచేస్తున్నట్లు చూడవచ్చు. ఇలా పని చేస్తుండగా ఏదో శబ్ధం వినిపించింది. ఏంటా అని లేచి చూసే సరికి ఒక్కసారిగా ఓ ఎద్దు వచ్చి దుకాణంలోకి ప్రవేశించింది. దీంతో షాపు లోపలి ఇద్దరు యువకులు ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం చూడవచ్చు. ఆ తర్వాత కూడా ఎద్దు చాలాసేపు అక్కడే ఉంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు.. ఆ ఎద్దును బయటకు తరిమేందుకు సాపపడటం చూడవద్దు.  ఈ ఘటన ఢిల్లీలోని సంగం విహార్‌లో చోటు చేసుకుంది.  ఎద్దు బీభత్సం వల్ల పరికరాలు డ్యామేజ్ అయ్యి.. షాపు వాళ్లకు కొంత నష్టం వాటిల్లింది. అయితే పోస్ట్ చేసిన వీడియో అసంపూర్తిగా ముగిసింది.  ఆ తర్వాత ఎద్దు.. ఇబ్బంది పెట్టకుండా బయటకు వచ్చిందా.. లేదా మరికాసేపు అక్కడి వారిని టెన్షన్ పెట్టిందా అనేది తెలియలేదు. 2 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి, ఈ వీడియో ఫుటేజీని చూసిన నెటిజన్లు వామ్మో ఇదేం ఎద్దురా బాబు అని ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..