AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గోధుమ కోత యంత్రంలో పడి ముక్కలు, ముక్కలు అయిన బాలుడు.. క్షణాల వ్యవధిలో

14 ఏళ్ల బాలుడు గోధుమ కోత యంత్రంలో చిక్కుకుని.. తీవ్ర నరకం అనుభవించి చనిపోయాడు. క్షణాల వ్యవధిలో అంతా జరిగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 14 ఏళ్ల బాలుడు తన పొలంలో పని చేస్తూ గోధుమలను కోసే యంత్రాన్ని నడుపుతున్నాడు. అయితే, అకస్మాత్తుగా, బలమైన గాలికి మెషిన్‌ను రక్షించడానికి ఉంచిన టార్పాలిన్ ఎగిరిపోయింది.

Viral Video: గోధుమ కోత యంత్రంలో పడి ముక్కలు, ముక్కలు అయిన బాలుడు.. క్షణాల వ్యవధిలో
Wheat Cutting Machine
Ram Naramaneni
|

Updated on: Apr 25, 2024 | 2:09 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోధుమ కోత యంత్రంలో పడి 14 ఏళ్ల బాలుడు మరణించాడు. ఈ దారుణ ఘటనలో బాలుడి మృతదేహం ఛిద్రమైపోవడంతో స్థానికులు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  సమాచారం ప్రకారం, 14 ఏళ్ల బాలుడు తన పొలంలో పని చేస్తున్నాడు. గోధుమ హార్వెస్టర్‌ను నడుపుతున్నాడు. అయితే ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో యంత్రంపై ఉంచిన టార్పాలిన్ ఎగిరిపోయింది. అయితే గోధమ కటింగ్ యంత్రం ఆన్‏లో ఉండగానే.. టార్పాలిన్ సరిచేసే యత్నం చేశారు. ఈ క్రమంలో అతడు టార్పాలిన్‌తో సహా హార్వెస్టర్‌లో పడిపోయాడు. బాలుడి అరుపులు విన్న వెంటనే పొరుగు పొలంలోని గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే అప్పటికే బాలుడి శరీరం ముక్కలు ముక్కలుగా పడి ఉంది.

యంత్రం దగ్గరకు చేరుకున్న స్థానికులు.. వెంటనే ఆ యంత్రాన్ని ఆపారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. బాలుడు ఆ యంత్రంలో ముక్కలు, ముక్కలు అయిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసి వారంతా చలించిపోయారు. వైరల్ అయిన ఒక వీడియోలో, బాలుడు యంత్రం లోపల చిక్కుకున్నట్లు చూడవచ్చు. అనంతరం అతి కష్టం మీద యంత్రం నుంచి బాలుడిని బయటకు తీసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత గ్రామంలో విషాదం నెలకొంది.

Note: వీడియోలో ఇబ్బందికర విజువల్స్ ఉన్నాయి. సున్నిత మనస్కులు చూడవద్దని మనవి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..