వామ్మో ఈ ఎద్దు బాహుబలి అనుకుంటా..! ఏకంగా ట్రాక్టర్‌తో ఢీ అంటూ ఢీ అంటూ..

వైరల్‌ వీడియో రోడ్డుపై నిలబడి ఉన్న ఒక ఎద్దు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన షాకింగ్ ఘటన కనిపించింది. ఇందులో డ్రైవర్ మొదట వెనక్కి తగ్గుతాడు. కానీ, ఎద్దు వెనక్కి కదలకపోవడంతో అతను యాక్సిలరేటర్‌ను నొక్కుతాడు. ట్రాక్టర్‌తో ఎద్దు ఢీ అంటే ఢీ అంటున్న ఈ దృశ్యం చూసి ప్రజలు షాక్ అయ్యారు. ఆ ఎద్దు తనను తాను బాహుబలి అనుకుంటుంది అంటూ నెటిజన్లు స్పందించారు.

వామ్మో ఈ ఎద్దు బాహుబలి అనుకుంటా..! ఏకంగా ట్రాక్టర్‌తో ఢీ అంటూ ఢీ అంటూ..
Bull Blocks Tractor

Updated on: Sep 02, 2025 | 10:39 AM

రోడ్డుపై తిరుగుతున్న విచ్చలవిడి జంతువులు, గుంపులు గుంపులుగా తిరిగే వీధి కుక్కలకు సంబంధించిన అనేక వీడియోలు తరచుగా సోషల్‌ మీడియాలో వైరల్ అవుతాయి. విచ్చలవిడి సంచరిస్తున్న జంతువుల కారణంగా పలు నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఒక సమస్యగా మారుతున్నాయి. కొన్ని సార్లు ఎద్దులు దూకుడుగా మారి పాదచారులపై దాడి చేస్తున్న ఘటనలు కూడా మనం తరచూగా చూస్తూనే ఉంటాం. ఈ దాడిలో ప్రజలు గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక ఎద్దు ట్రాక్టర్‌తో తలపడుతున్న దృశ్యం కనిపించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక ఎద్దు ట్రాక్టర్‌ను ఢీకొడుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రారంభంలో ట్రాక్టర్ డ్రైవర్ ఎద్దును తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎద్దు వెనక్కి కదలనప్పుడు, డ్రైవర్ యాక్సిలరేటర్‌ను నొక్కుతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో చూసిన ప్రజలు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఎద్దు తాను బాహుబలి అనుకుంటోంది అంటూ రాశారు. ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వీక్షణలు, వందల లైక్‌లు, అనేక కామెంట్స్‌ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో ఆగస్టు 31న X హ్యాండిల్ @WaleAyodhy70737 నుండి పోస్ట్ చేయబడింది. దీని క్యాప్షన్‌లో నగర్ పంచాయతీ ట్రాక్టర్ ముందు ఎద్దు నిలబడి ఉంది. దారితప్పిన ఎద్దు కోపంతో ఎర్రబడి ట్రాక్టర్‌తో ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంగా గేర్‌ను మారుస్తూ ఎద్దును దూరంగా నెట్టాడు. ఈ క్లిప్ కేవలం 26 సెకన్ల నిడివి మాత్రమే ఉంది. ఇందులో, రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాక్టర్ ముందు ఒక ఎద్దు రాయిలా నిలబడి ఉండటం కనిపిస్తుంది. కోపంతో, ఎద్దు ట్రాక్టర్‌ను నెట్టడం ప్రారంభిస్తుంది. డ్రైవర్ మొదట ట్రాక్టర్‌ను వెనక్కి తీసుకుంటాడు. కానీ ఎద్దు వెనక్కి తగ్గదు. దాంతో డ్రైవర్ కోపంగా ట్రాక్టర్‌ను గేర్‌లో ఉంచి యాక్సిలరేటర్‌ను నొక్కాడు. ట్రాక్టర్ ముందుకు కదులుతుంది. ఎద్దు వెనక్కి కదలడం ప్రారంభిస్తుంది. కానీ అది తన బలంపై చాలా నమ్మకంగా ఉంది. ఆ ఎద్దు వెనక్కి తగ్గేదేలేదు అన్నట్టుగా ట్రాక్టర్‌తో పోటీ పడుతోంది. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూస్తూ తమ సెల్‌ఫోన్‌ కెమెరాల్లో రికార్డ్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..