Buffalo Viral Video: మృత్యు ఘంటికలు మోగితే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేరంటారు. అచ్చం ఇలాంటి పరిస్థితే.. ఈ అడవి దున్న (Buffalo) కు ఏదురైంది. అడవి దున్నకు జీవించాలనే సంకల్పం బలంగా ఉంది.. జీవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు మృత్యువు నుంచి తప్పించుకోవడానికి కష్టపడింది. కానీ విధి దానిని మళ్లీ కాటేసింది. తాజాగా.. ఒక అడవి దున్న సింహం ( Lion) వేట నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మరింత ప్రమాదంలో పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘nature27_12’ అనే యూజర్ అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను దాదాపు 22,000 మంది వీక్షించారు. వీడియోలో.. అడవి దున్నను సింహం వెంబడిస్తుంది. దీంతో తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు దున్న పరిగెత్తడాన్ని చూడవచ్చు. అయితే.. నదిలోకి వెళితే.. ప్రాణాన్ని కాపాడుకోవచ్చని దున్న లోపలికి దిగుతుంది. కానీ.. దానిలో ప్రమాదర మొసలి ఉండటాన్ని గ్రహించలేకపోతుంది. అయితే.. ప్రాణాన్ని కాపాడుకునేందుకు దున్న నదిలో ఈదుకుంటూ వెళుతుండగా.. సింహం దూరం నుంచి నిరాశతో అలానే చూస్తుంటుంది.
వైరల్ వీడియో..
అయితే.. అకస్మాత్తుగా ఒక మొసలి (Crocodile) దున్న వెనుక నుండి వచ్చి దానిపై దాడి చేస్తుంది. దీంతో దాని నుంచి బయటపడేందుకు దున్న తీవ్రంగా పోరాడుతుంది. చివరకు మొసలి నుంచి బయటపడుతుంది. ఈ క్రమంలో ఒడ్డుకు చేరేందుకు వెళ్లగా.. అక్కడ సింహాల మంద ఎర కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాయి. ఈ పరిస్థితుల్లో దున్నకు ఏం చేయాలో తెలియక అలానే నిలబడి చూస్తుంటుంది. అయితే.. దున్న చివరకు బతికిందో లేదో అన్న క్లారిటీ మాత్రం ఈ వీడియోలో చూపించలేదు. కానీ.. ఈ వీడియో చూస్తే.. దున్నకు బతికే అవకాశాలు తక్కువేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: