ఇదో వింత సంఘటన.. వారం వ్యవధిలో రెండు సార్లు ప్రసవించిన గేదె.. అద్బుతాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం..

|

Jan 18, 2024 | 1:11 PM

సాధారణంగా, ఆవులు, గేదెలు కవల పిల్లలకు జన్మనిస్తే, అదే రోజున ప్రసవిస్తుంది. అయితే ఈ గేదె ఒక దూడకు జన్మనిచ్చి ఎనిమిది రోజుల తర్వాత మరో దూడకు జన్మనిచ్చింది. గేదెలకు కృత్రిమ గర్భధారణ కూడా చేయడం లేదు. ప్రస్తుతం ఈ విషయాన్ని ఇప్పటికే పశుసంవర్థక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. ఇకపోతే, రెండు దూడలు, తల్లి గేదె పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు.

ఇదో వింత సంఘటన.. వారం వ్యవధిలో రెండు సార్లు ప్రసవించిన గేదె.. అద్బుతాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం..
buffalo gave birth two calf in week
Follow us on

ప్రకృతిలో అద్భుతాలు మనుషులతోనే కాదు జంతువులతో కూడా జరుగుతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి రావడంతో ఇప్పుడు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఒక గేదె దూడకు జన్మనిచ్చింది. ఇది సాధారణ విషయమే… అయితే సరిగ్గా 8 రోజుల తర్వాత అదే గేదె మళ్లీ మరో దూడకు జన్మనిచ్చింది. మొత్తానికి ఈ గేదె వారం వ్యవధిలో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ గేదె, దాని పిల్లలను చూసేందుకు ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి బారులు తీరారు.. అంతే కాదు ఆ గేదె యజమాని కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ గేదె పరిశోధన అంశంగా మారింది. ఒక దూడకు జన్మనిచ్చిన గేదె 8 రోజుల వ్యవధిలో మరో దూడకు ఎలా జన్మనిచ్చిందన్న ప్రశ్న సర్వత్ర ఆసక్తిని కలిగిస్తుంది. ఈ వింత ఘటన చిక్కమంగళూరు జిల్లా ఎన్‌ఆర్‌ పురా తాలూకా శంకర్‌పూర్‌లో చోటుచేసుకుంది.

హలియూరుకు చెందిన సుధాకర్ గౌడ్ శంకర్ పూర్ సమీపంలోని మదుబా రోడ్డులో నివసిస్తు్న రైతు. వారం రోజుల క్రితం ఆయన ఇంట్లో గేదె మగదూడకు జన్మనిచ్చింది. వారం రోజుల తర్వాత అదే గేదె మరో దూడకు జన్మనిచ్చింది. ఇప్పుడు దానికి రెండు దూడలు ఉన్నాయి. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి. దీంతో సుధాకర్ కూడా ఆశ్చర్యపోయాడు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ ఘటనను ఓ అద్భుతంగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై గేదె యజమాని రైతు సుధాకర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఎన్నో ఏళ్లుగా పశువుల పెంపకం చేస్తున్నామని, ఇలాంటి వింత సంఘటన మాత్రం జరిగింది ఇదే తొలిసారి అంటున్నాడు.. సాధారణంగా, ఆవులు, గేదెలు కవల పిల్లలకు జన్మనిస్తే, అదే రోజున ప్రసవిస్తుంది. అయితే ఈ గేదె ఒక దూడకు జన్మనిచ్చి ఎనిమిది రోజుల తర్వాత మరో దూడకు జన్మనిచ్చింది. గేదెలకు కృత్రిమ గర్భధారణ కూడా చేయడం లేదు. ప్రస్తుతం ఈ విషయాన్ని ఇప్పటికే పశుసంవర్థక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. ఇకపోతే, రెండు దూడలు, తల్లి గేదె పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి