Watch: బౌద్ధ సన్యాసిగా మారిన పిల్లి..! గురువు మాటలు ఎంత శ్రద్ధగా వింటుందో చూస్తే అవాక్కే..!!

|

Sep 18, 2024 | 8:29 PM

వీడియో క్యాప్షన్లో థాయిలాండ్‌లోని ఒక బౌద్ధ పిల్లి తన మతానికి సంబంధించిన పాఠాలు వింటోంది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే వేగంగా వైరల్‌గా మారింది. వీడియోపై చాలా మంది నెటిజన్లు కామెంట్ చేయటం మొదలుపెట్టారు.

Watch: బౌద్ధ సన్యాసిగా మారిన పిల్లి..! గురువు మాటలు ఎంత శ్రద్ధగా వింటుందో చూస్తే అవాక్కే..!!
Buddhist Cat
Follow us on

మీరు పిల్లి ప్రేమికులా? అవును అయితే ఫర్వాలేదు, కాకపోయినా ఈ వీడియో చూసి మీరు కడుపుబ్బ నవ్వుకోవటం మాత్రం ఖాయం అని చెప్పాలి.. ప్రతి రోజు సోషల్ మీడియాలో పిల్లులు, కుక్కలకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈ వీడియో ఒకటి. వీడియో చూసిన తర్వాత ఇలాంటి పిల్లిని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక పిల్లి బౌద్ధ సన్యాసిలా మారింది.

ఈ వీడియోను మిసా మాయ అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న పిల్లి బౌద్ధ సన్యాసి వేషధారణలో ఉంది. మెడలో దండ, ఒంటిపై బౌద్ధ సన్యాసులు వేసుకునే కండువా ధరించి ఉంది. అంతేకాదు.. స్టైల్‌గా కళ్లజోడు కూడా ధరించి ఉంది. ఇక, ఆ పిల్లి పక్కనే ఒక బౌద్ధ సన్యాసి కూడా కూర్చున్నాడు. సన్యాసి పిల్లి ముందు కాలిని తన చేతిలో పట్టుకుని ఏదో మాట్లాడటం కనిపిస్తుంది. పిల్లి కూడా అతని మాటలు చాలా శ్రద్ధగా వింటోంది. గురువు ఎదురుగా బౌద్ధ సన్యాసి ఎలా ప్రశాంతంగా కూర్చుంటాడో, ఈ పిల్లి కూడా అలాగే కూర్చుని ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

వీడియో క్యాప్షన్లో థాయిలాండ్‌లోని ఒక బౌద్ధ పిల్లి తన మతానికి సంబంధించిన పాఠాలు వింటోంది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే వేగంగా వైరల్‌గా మారింది. వీడియోపై చాలా మంది నెటిజన్లు కామెంట్ చేయటం మొదలుపెట్టారు.

థాయ్‌లాండ్‌లో తమ ప్రతిజ్ఞను నెరవేరని బౌద్ధ సన్యాసులు పిల్లులుగా తిరిగి జన్మిస్తారంటూ ఒక నెటిజన్‌ ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. ఈ పిల్లి ఇంత ప్రశాంతంగా ఎలా కూర్చుంటుందని మరోవ్యక్తి అడిగారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..