Viral Video: పానీ పూరి బండి లాగడానికి థార్‌.. ఆనంద్‌ మహీంద్ర రియాక్షన్‌ ఏంటంటే..

ఈ క్రమంలోనే గతంలో ఈమె స్కూటర్‌తో పాటు ఆ తర్వాత బుల్లెట్ బైక్‌ సహాయంతో పానిపూరీ బండిని నడిపించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏకంగా మహీంద్ర థార్‌ కారు సహాయంతో పానిపూరి బండిని లాగుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో...

Viral Video: పానీ పూరి బండి లాగడానికి థార్‌.. ఆనంద్‌ మహీంద్ర రియాక్షన్‌ ఏంటంటే..
Viral Video

Updated on: Jan 25, 2024 | 9:40 PM

సోషల్‌ మీడియా గురించి కనీస అవగాహన ఎవ్వరికైనా బీటెక్‌ పానిపూరి వాలి గురించి తెలిసే ఉంటుంది. ఈ పేరు పానిపూరి ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పలు చోట్ల స్టాల్స్‌ ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విస్తరించారు. తాప్సీ ఉపాధ్యాయ్ అనే ఔత్సాహిక గ్రాడ్యేయేటర్‌ ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు.

ఈ క్రమంలోనే గతంలో ఈమె స్కూటర్‌తో పాటు ఆ తర్వాత బుల్లెట్ బైక్‌ సహాయంతో పానిపూరీ బండిని నడిపించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏకంగా మహీంద్ర థార్‌ కారు సహాయంతో పానిపూరి బండిని లాగుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దాదాపు రూ. 17 లక్షల విలువైన కారును పానిపూరి బండిని లాగడానికి ఉపయోగిస్తుండడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.

వైరల్ వీడియో..

 

దీంతో ఈ వీడియో వైరల్‌ అయ్యి చివరికి ఆనంద్‌ మహీంద్ర కంట పడింది. దీంతో తన కంపెనీకి చెందిన ఖరీదైన కారును పానీపూరి బండి లాగడానికి ఉపయోగిస్తుండడంతో ఆనంద్‌ మహీంద్ర.. ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠనెలకొంది. ఈ వీడియో చూసిన ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌ వేదికగా వీడియోను పోస్ట్‌ చేస్తూ ఆసక్తికర కామెంట్‌ చేశారు. ప్రజలు ఎదగటానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నట్లు, ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆ యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..