Video: మంచిగా రెడీ అయి కాలేజీకి బయల్దేరిన యువతి! అంతలోనే.. వీధి కుక్కలు దాడి చేసి..

ఇండోర్‌లోని కాలేజీ విద్యార్థినిపై వీధి కుక్కల దాడి జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దాడి దృశ్యాలు వైరల్ అయ్యాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్నేహితురాలి సహాయంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన వీధి కుక్కల బెడదను ప్రజలకు చూపిస్తోంది.

Video: మంచిగా రెడీ అయి కాలేజీకి బయల్దేరిన యువతి! అంతలోనే.. వీధి కుక్కలు దాడి చేసి..
Dogs Attack

Updated on: Jul 17, 2025 | 11:16 AM

వీధికుక్కల బెడద బాగా పెరిగిపోయింది, ప్రజలు వీధుల్లోకి రావడానికి కూడా భయపడే పరిస్థితి. ఈ కుక్కలు పిల్లలు, వృద్ధులు సహా అందరిపై దాడి చేస్తున్నాయి. తాజాగా ఓ కాలేజీ అమ్మాయిపై వీధి కుక్కలు క్రూరంగా దాడి చేశాయి. ఆ దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. ఉదయం కాలేజీకి వెళుతున్న యువతిపై కొన్ని వీధికుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి. ఆ యువతి స్నేహితురాలి సాయంతో ప్రాణాలతో బయటపడింది. ఈ భయంకరమైన దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. వీధికుక్కల గుంపు అకస్మాత్తుగా కాలేజీ అమ్మాయిపై దాడి చేసింది. ఉదయమే పరీక్ష ఉండటంతో ఆమె కాలేజీకి కొంచెం త్వరగా బయలుదేరింది. కాలేజీకి వెళ్లే దారిలో కుక్కలు ఆమెపై దాడి చేశాయి. కుక్కలు ఒకసారి కాదు, రెండుసార్లు ఆమెపై దాడి చేశాయి, కానీ అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి స్నేహితురాలి సహాయంతో ప్రమాదం నుండి బయటపడింది. కుక్కల దాడిలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. తరువాత స్థానికుల సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను Incognito అనే X ఖాతాలో షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి