VIRAL VIDEO : రష్యాలో ఓ ట్రక్ నదిపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో వాహనంతో పాటు డ్రైవర్ నీటిలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ట్రక్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. తూర్పు రష్యాలోని ఓ నదిలో వరదలు సంభవించాయి. ఈ సమయంలో నది నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో డ్రైవర్ ఈ వంతెనను దాటాలని ప్రయత్నించాడు. ట్రక్కును వంతెనపైకి ఎక్కించి ముందుకు కదిలాడు. కానీ వంతెన మధ్యలోకి రాగానే ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. దీంతో డ్రైవర్‌తో పాటు వాహనం కూడా నదిలో పడిపోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
విషయమేమిటంటే ఈ వంతెన చెక్కతో తయారు చేశారని తేలింది. మునుపటి వరదలలో కాంక్రీట్ వంతెన కొట్టుకుపోగా ప్రస్తుతం ఈ వంతెనను తయారు చేశారు. అయితే ఇటీవల వరదలు సంభవించడంతో ఈ వంతెన దాటాలంటే స్థానికులు భయపడేవారు. వీడియోలో ట్రక్ వంతెనపైకి ఎక్కి ముందుకు కదులుతున్నప్పుడు వంతెన క్రిందికి వంగిపోతున్నట్లు చూడవచ్చు. ట్రక్ వంతెన మధ్యలోకి చేరుకోవడంతో విరిగింది. ఈ సంఘటన రాజధాని మాస్కోకు తూర్పున 3700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరియం గ్రామంలో జరిగింది.
ఈ ప్రమాదకరమైన సంఘటనలో డ్రైవర్ బతికిపోయాడు. కానీ అతని ట్రక్ మునిగిపోయింది. ఈ సంఘటన తరువాత ఉరాయిం గ్రామస్థులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వారికి ఇప్పుడు నదిని దాటడానికి వేరే మార్గం లేదు. అటువంటి పరిస్థితిలో వారు నదిని దాటడానికి మరొక వంతెనను నిర్మించాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉరేయం వంతెన మాత్రమే కాకుండా అనేక వంతెనలు దెబ్బతిన్నాయి.
#Russia: A suspension bridge near the village of Uryum, east of Chita, #collapsed when a truck tried to cross it. The driver survived.
pic.twitter.com/Azl0NQeuU1— Chaudhary Parvez (@ChaudharyParvez) July 23, 2021