Viral Video: కెమెరా ఎఫెక్ట్ ఈ రేంజ్‌లో ఉంటుందా.. పెళ్లి కూతురు రియాక్షన్ చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు..

Viral Video: పెళ్లంటే ఏం జంటకైనా పండుగే. వివాహ సమయం ఆసన్నమైన తరువాత దాదాపు ఒక ఐదు రోజుల పాటు ఇరు కుటుంబా ఇళ్ల వద్ద సందడే సందడిగా ఉంటుంది.

Viral Video: కెమెరా ఎఫెక్ట్ ఈ రేంజ్‌లో ఉంటుందా.. పెళ్లి కూతురు రియాక్షన్ చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు..
Viral Pic Of Bride

Updated on: Aug 02, 2021 | 1:38 PM

Viral Video: పెళ్లంటే ఏం జంటకైనా పండుగే. వివాహ సమయం ఆసన్నమైన తరువాత దాదాపు ఒక ఐదు రోజుల పాటు ఇరు కుటుంబా ఇళ్ల వద్ద సందడే సందడిగా ఉంటుంది. డీజేలు, డ్యాన్స్‌లు, ఫోటో షూటింగ్‌లు, ఆటలు, పాటలు ఒకటేమిటి.. రచ్చ రచ్చే అని చెప్పాలి. పెళ్లి తంతులో ముఖ్యంగా ఫోటో షూట్‌దే అగ్రస్థానం అని చెప్పారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుగా తయారు చేసింది మొదలు.. అప్పగింతలు అయ్యే వరకు ఫోటో షూటింగ్ తప్పని సరి. ఒక విధంగా చెప్పాలంటే.. ఫోటో షూట్ లేకపోతే పెళ్లిని నిలిపివేసే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి.

ఇదిలాఉంటే.. ఫోటోల పట్ల అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఆసక్తి ఎక్కువ అని చెప్పొచ్చు. చాలా అమ్మాయిలు కెమెరా ముందు పూనకం వచ్చినట్లే ప్రవర్తిస్తుంటారు. కెమెరా ఆన్ చేయడం ఆలస్యం.. ఆటోమాటిక్‌గా రకరకాల ఫోటోలు ఇచ్చేస్తుంటారు. తజాగా ఓ పెళ్లి కూతురు కూడా అలానే చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కడబుపుబ్బా నవ్వుకుంటున్నారు. కెమెరా ఎఫెక్ట్ మరీ ఈ రేంజ్‌లో ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ఓ వధువు వివాహ వేదిక వద్దకు వస్తోంది. కళ్లకు సన్‌ గ్లాసెస్ ధరించి.. లెహెంగాలో వేదిక వద్దకు వస్తోంది. అయితే, వధువు ఎంట్రీ నేపథ్యంలో కెమెరా మెన్‌ ఆమెను వీడియో, ఫోటో తీస్తున్నారు. అంతలోనే సడెన్ షాక్ ఇచ్చింది ఆ వధువు. రకరకాలుగా భంగిమలు మారుస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఫోటో ఫోజులను చూసి పక్కన ఉన్నవారు సైతం నవ్వుకున్నారు. కాగా, ఈ ఫన్నీ వీడియోను
official_niranjanm87 అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. అమ్మ బాబోయ్.. మరీ ఈ రేంజ్‌లో కెమెరా ఎఫెక్ట్ ఉందా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ వీడియోను ఆదివారం నాడు పోస్ట్ చేయగా.. ఇప్పుడది ట్రెండింగ్‌గా మారింది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Viral Video: సడెన్‌గా ప్రత్యక్షమైన సింహం.. హడలిపోయిన టూరిస్ట్‌లు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

CET Exams: తెలంగాణలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలు మీకోసం..

Viral Video: మనుషుల గ్యాంగ్ వార్ చూశారు.. మరి కోతుల గ్యాంగ్ వార్ చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..