Viral Video: వామ్మో.. పెళ్లి వేదికపైనే వరుడికి చుక్కలు చూపించిన వధువు.. వీడియో వైరల్

Bride Groom Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. వీడియోల్లో వెడ్డింగ్‌కు సంబంధించినవి ఉంటాయి. వైరల్ అయ్యే

Viral Video: వామ్మో.. పెళ్లి వేదికపైనే వరుడికి చుక్కలు చూపించిన వధువు.. వీడియో వైరల్
Wedding

Updated on: Jan 21, 2022 | 1:15 PM

Bride Groom Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే.. వీడియోల్లో వెడ్డింగ్‌కు సంబంధించినవి ఉంటాయి. వైరల్ అయ్యే ఈ పెళ్లి వీడియోల్లో ఎక్కువగా వధూవరుల (Bride Groom) ఫన్నీ వీడియోలు ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ జరుగుతున్నందున.. పరుల్ గార్గ్ అనే మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయింది. పెళ్లి సమయంలో వధూవరుల మధ్య జరిగిన ఓ సన్నివేశం నెట్టింట (Viral Video) నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో వధూవరులు ఒకరికొకరు దండలు మార్చుకోవడానికి వేదికపై నిలబడి ఉంటారు. అయితే వరుడు వధువును మాల ధరించేందుకు సిద్ధమవుతాడు. వధువు మెడలో మాల వేసేక్రమంలో వెనుకకు వాలుతుంది. వరుడు అలా దండవేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అప్పుడు యువతి వెనుకకు వాలుతూనే ఉంటుంది.

చివర్లో వధువు ఇబ్బంది పడుతూ పైకి లేస్తుంది.. ఈ సమయంలో ఆమెకు వరుడు కూడా సాయమందిస్తాడు. ఇది చూసిన వాళ్లంతా ఏంటి వధువు యోగా.. చేస్తుందా.. లేక సర్కస్ ఫీట్లు చేస్తుందా .. ? అంటు నవ్వుకుంటున్నారు. ఈ సందర్భంగా వధూవరులు కూడా ఒకరినొకరు చూసి నవ్వుకోవడం మొదలుపెడతారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో (
Viral Video) చూడండి..

ఈ వైరల్ వీడియో 3 రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అప్పటినుండి 2 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాకుండా.. పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ దీది ఖచ్చితంగా యోగా టీచర్ అయిఉంటుందని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఈ స్టంట్ లో వరుడే ఓడిపోయాడంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read:

Viral Video: ఇక్కడ బేరాలు లేవమ్మా.. కోతి కూరగాయల యాపారం మామూలుగా లేదుగా..

Crime News: నిద్రలో కలవరించి అడ్డంగా బుక్కయిన మహిళ.. ఆమె రహస్యాలు విన్న భర్త ఏం చేశాడంటే..